హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan-Chandrababu: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?

Jagan-Chandrababu: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు.. ఎందుకంటే..?

చంద్రబాబుతో టీ, జగన్ తో లంచ్

చంద్రబాబుతో టీ, జగన్ తో లంచ్

Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. అది కూడా హస్తిన వేదికగా జరగనుంది. అది కూడా ప్రధాని మోదీ అధ్యక్షతన.. నిజ జీవిత శత్రువుల్లా మారిన ఏపీ సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇద్దరూ ఒకే వేదికపైకి రానున్నారు. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలకు సంబంధించి కీలక పరిణమాం చోటు చేసుకోనుంది. ఎవరూ ఊహించని విధంగా ఒకే వేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పంచుకోనున్నారు. డిసెంబర్ 5వ తేదీన ప్రధాని మోదీ (Prime Minister Modi) అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు అవ్వాలి అంటూ.. అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా ఈ ఇద్దరు నేతలకు కూడా ఆహ్వానం అందింది.

  కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు. సాధరణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జగన్, చంద్రబాబు మధ్య ఉన్నది కేవలం రాజకీయ వైరంగా లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతటి వేడి వాతావరణం ఉంది. ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం తారా స్థాయి దాటిపోయింది. ఒకరి ముందు ఇంకొకరి పేరు తీస్తేనే ఆగ్రహంతో రిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి.

  ఇలాంటి నేపథ్యంలో ఇరు నేతలను ఒకే వేదిక పైకి వస్తారిన ఊహించడం కష్టమే.. కానీ అది జరగబోతోంది. వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు.

  ఇదీ చదవండి : రాజధాని జిల్లా అయినా అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందా..? కారణం ఇదే..?

  ఆ మధ్య 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో ప్రధానితో చంద్రబాబు భేటీ కాగా.. ఈనెల 12న విశాఖ పర్యటనలో ప్రధానితో కలిసి ఒకే వేదికపై కనిపించారు సీఎం జగన్ . ఇక ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రధానితో వేదికను జగన్, చంద్రబాబు పంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  ఇదీ చదవండి : వైసీపీకి కొత్త జిల్లాలు రాజకీయంగా కలిసి రాలేదా..? అసలు సమస్య ఏంటంటే?

  కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు డిసెంబర్ 5వ రెండు పార్టీల అధినేతలు వెళ్లడం ఖరారైంది. ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం కూడా కేవలం అదే రీజన్ తో ఢిల్లీ వెళ్తున్నారు. అయితే వేదిక ఏదైనా.. ఇద్దరు నేతలు ఒకే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. ఒకే సమయంలో ఇద్దరు నేతలు పాల్గొన్న సందర్భాలు కూడా చాలా అరుదైన ఘటనే కావడం ఉత్కంఠగా మారింది.. ఈ సమయంలో ఎదురుపడితే.. మన నేతల మధ్య పలకరింపులు ఉంటాయా? నమస్కారాలు, ప్రతి నమస్కారాలు కూడా ఉండనున్నాయా? అనేది వేచి చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Politics, Chandrababu Naidu, Pm modi