AP PRC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ఇచ్చారు. పీఆర్సీని ప్రకటించడంతో పాటు.. మరిన్ని వరాలు కురిపించారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
CM Jagan On PRC: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక (Sankrathi Gift) అందించారు.. వారు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న పీఆర్సీతో పాటు.. కీలక వరాలు కురిపించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వివాదంగా మారిన పీఆర్సీ (PRC)ని ముందు చెప్పినట్టు ఆయన ప్రకటించారు. ఏపీ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. అలాగే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సీపీఎస్ పైనా జులై 30 లోపు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు. అలాగే కొత్త జీతాలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అన్నీ ఏప్రిల్ 30వ తేదీ లోపు క్లియర్ చేస్తాము అన్నారు.
ఏపీ ఉద్యోగుల సమస్యలు అన్నీ రెండు వారాల్లోనే క్లియర్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఈ ఏడాది జులై నుంచి రెగ్యులర్ చేస్తామన్నారు. సొంత ఇళ్లు లేని ఉద్యోగులకు జగనన్న స్మార్ట్ టౌన్ లో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎంఐజీ లే ఔట్లలో పది శాతం రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నంత ఫిట్ మెంట్ ఇవ్వకపోయినా. ఆయా నేతలకు బుజ్జగింపు తరహాలో రాష్ట్ర పరిస్థితిని వివరింరు. వారి అందర్నీ ఒప్పించి 23శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఆదాయం, రెవిన్యూ పరిస్థితిని చెప్పుకొచ్చిన సీఎం.. ఉద్యోగుల కుటుంబ సభ్యుడిగా తాను చేయగలిగినంత చేస్తున్నాను అని ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు అమలవ్వనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. దీనితో మరిన్ని శుభవార్తలు చెప్పారు సీఎం జగన్.. జూన్ 30లోపు కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ వేస్తామని.. రెండు వారాల్లోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అని జగన్ హామీ ఇచ్చారు.
తాజాగా సీఎం జగన్ ప్రకటించిన ఫిట్ మెంట్ పై అన్ని రాకాల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తాము కోరినంత ఫిట్ మెంట్ ఇవ్వకపోయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన వారిగా.. సీఎం నిర్ణయానికి ఆమోదం తెలిపాము అన్నారు. అలాగే అన్ని సమస్యలను సానుకూలంగా ఉన్న సీఎం పెద్ద మనసుతో తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి రెండు నెలల నుంచి ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనలకు ఎండ్ కార్డు పడింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.