హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Temple Vandalism: దూకుడుమీదున్న సీఐడీ.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సోదాలు.. ఏం దొరికాయంటే..?

Temple Vandalism: దూకుడుమీదున్న సీఐడీ.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సోదాలు.. ఏం దొరికాయంటే..?

ప్రవీణ్ చక్రవర్తి(ఫైల్ ఫొటో)

ప్రవీణ్ చక్రవర్తి(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హిందూ ఆలయాలపై దాడులు (Hindu temples vandalism), మత విద్వేషాలు రెచ్చగొట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 80 కేసులకు సంబంధించి వివరాలు బయటపెట్టిన ప్రభుత్వం, పలువుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు, మత విద్వేషాలు రెచ్చగొట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 80 కేసులకు సంబంధించి వివరాలు బయటపెట్టిన ప్రభుత్వం, పలువుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఈ క్రమంలో విగ్రహాల ధ్వంసం కేసులో అరెస్టైన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసులో తాను కీలక పాత్ర పోషించినట్టుగా ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విధ్వంసాల కేసులో టీడీపీ, బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా ఏపీ డీజీపీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఆయన నివాసంలో సోదాలు చేశారు. తొలుత ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.., ఆ తర్వాత అతడు నిర్వహించే చర్చి, స్కూలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి క్రైస్తవ మత బోధకుడిగా పనిచేస్తున్నారు. బెంగళూరు గా-సిప్స్ అనే య్యూట్యూబ్ ఛానల్లో ఇతర మతాలను కించపరిచేలా  వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా., తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల కాలితో తన్నానంటూ వీడియోలో పేర్కొన్నాడు. ఏడాది క్రితం పోస్టైన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.

  ప్రస్తుతం సీఐడీ అదుపులో ఉన్న ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు విచారిస్తున్నారు. అతడు వీడియోలో వెల్లడించిన వివరాలను బట్టి దీని వెనుక కుట్రకోణం ఉందా..? లేక మత ప్రచారంలో భాగంగా అలాంటి వ్యాఖ్యలు చేశాడా..? అనే దానిపై ఆరాతీస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విధంగా ఎక్కడైనా విగ్రహాలు ధ్వంసం చేసారా..? అతను వీడియో చేసిన వ్యాఖ్యల్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

  ఐతే ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్ విషయంలో ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఏడాది క్రితమే హిందూ మతాన్ని, దేవుళ్లను కించపరుస్తూ వీడియోలు పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించాయి. అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి, మంత్రి కన్నబాబుకు సంబంధముందని టీడీపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన మంత్రి కన్నబాబు.., టీడీపీ హాయంలోనే ప్రవీణ్ పై కొన్ని కేసులు ఎత్తివేశారని కౌంటర్ ఇచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Temple Vandalism, Hindu Temples, Police

  ఉత్తమ కథలు