• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGANMOHANREDDY CONDUCTS REVIEW ON HOUSING SCHEME FOR POOR AND ORDERS TO PROVIDE HIGH CLASS INFRASTRUCTURE IN YSR JAGANANNA COLONIES HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: పేదల కాలనీల్లో అవన్నీ ఉండాల్సిందే.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh: పేదల కాలనీల్లో అవన్నీ ఉండాల్సిందే.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పేదల గృహనిర్మాణ పథకంపై (AP Housing Scheme) దృష్టిపెట్టింది. వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల గృహనిర్మాణ పథకంపై దృష్టిపెట్టింది. వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పేదల గృహనిర్మాణ పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో వేగంగా ఇళ్ళ నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా చర్చించారు. పేదల కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కాలనీలు అందరికీ ఆదర్శంగా ఉండాలని మురికివాడలుగా కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కాలనీల బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.. ప్రతి ఒక్క లే అవుట్ ను అధికారులు రీ విజిట్ చేసి దానికి అనుగుణంగా ఆందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

    అందరికీ ప్రాధాన్యం
    ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధుల విషయంలో సీఎం జగన్ కీలక ఆదేశాలిచ్చారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలన్నారు. దీనివల్ల ఇళ్లనిర్మాణాలు వేగంగా ముందుకు సాగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. తొలి విడతలో 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని.. 83శాతం మంది లబ్ధిదారులు మూడు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకున్నట్లు వివరించారు. మూడు ఆప్షన్లలో ఏది ఏంచుకున్నా లబ్ధిదారులకు సబ్సిడీపై సిమెంట్, స్టీల్ అందించాలని ఆదేశించారు. బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందన ఆ అవకాశం అందరికీ వర్తింపజేయాలని సూచించారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని, దీనివల్ల తామే ఇళ్లుకట్టుకుంటామంటూ ఆప్షన్‌ ఎంచుకున్నవారికీ లబ్ధిచేకూరుతుందన్నారు.

    ఇది చదవండి: దుర్గగుడిలో ఏసీబీ దాడుల కలకలం... అమ్మసన్నిధిలో అవినీతి నిజమేనా..?



     అంగన్వాడీలు, లైబ్రరీలు
    వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలన్న ముఖ్యమంతమ్రి.. కాలనీల్లో జనాభాకు తగినట్టుగా రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండేలా చూడాలని, రోడ్ల నిర్మాణం జనాభాకు అనుగుణంగా ఉండాలని సూచించారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ కేంద్రం., ప్రతి 1500 నుంచి 5వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కాలనల్లో పార్కుల ఏర్పాటుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

    పట్టణాల్లో తక్కువ ధరలకే..
    పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమంపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కాలనీల్లో కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో ఉత్తమ విధానాలను అనుసరించాలని.. ముఖ్యంగా మొక్కలు నాటే విషయంలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్నిచ్చే మొక్కలను నాటాలన్నారు. కాలనీలు నిర్మాణం అవుతున్నప్పుడే చెట్లను నాటడానికి మార్కింగ్‌ చేయాలని చెప్పారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, మున్సిపల్, గృహనిర్మాణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు