Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGAN TO PARTICIPATE IN GOPUJA PROGARAM IN NARASARAOPET SU

Andhra Pradesh: నేడు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం.. నరసరావుపేటలో గోపూజ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్

వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం గోపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం గోపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD), దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పాల్గొనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం సీఎం జగన్ నేడు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించనున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్‌ తాడేపల్లి చేరుకోనున్నారు.

    ఇక, ‘గోవు సమస్త దేవతాస్వరూపం. గోమాతను పూజించడం రుషులకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. గోవుల యందు సకల దేవతలు, తీర్థాలు కొలువై ఉన్నాయని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. గోవుకు సమానమైనది లేదు. గోపూజ చేయడం వలన, గో సంరక్షణ చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి. గోపూజ జరపడం వలన మానవాళిని పీడిస్తున్న సమస్త దోషాలు తొలగి, శ్రేయస్సు కలుగుతుంది. గోమాతల రక్షణ సర్వమాణవాళి రక్షణ కాగలదు.’ అని దేవాదాయ శాఖ పేర్కొంది.

    మరోవైపు ఏపీలో వరుసగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అధికార, విపక్షల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే దేవాలయాలపై దాడులకు పాల్పడేవారి ఆటకట్టించేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక,  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది కాబట్టే కడుపుమంటతో రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. అర్ధరాత్రి ఎవరూ లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నది ఎవరో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు. రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Guntur, Narasaraopet, Ttd, Ys jagan mohan reddy

    తదుపరి వార్తలు