Andhra Pradesh : ఎంపీలాడ్స్ ఖ‌ర్చుల వివ‌రాలు ఇవ్వండి.. రాష్ట్రానికి కేంద్రం లేఖ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ లోగో

మెంబ‌ర్ ఆఫ్ పార్ల‌మెంట్ లోక‌ల‌ర్ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ (Members of Parliament Local Area Development) నిధుల దుర్వినియోగంపై వివరణ కోరుతూ కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎంపీలాడ్స్‌ నిధులు ఖర్చు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేద‌ని ఫిర్యాదు కార‌ణంగా ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది.

  • Share this:
    మెంబ‌ర్ ఆఫ్ పార్ల‌మెంట్ లోక‌ల‌ర్ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ (Members of Parliament Local Area Development) నిధుల దుర్వినియోగంపై వివరణ కోరుతూ కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎంపీలాడ్స్‌ నిధులు ఖర్చు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేద‌ని ఫిర్యాదు కార‌ణంగా ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది. మతపరమైన భవనాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం ఎంపీలాడ్స్ (MPLADS) నిధులు కేటాయించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు వివరణ కోరుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ లాడ్స్ (MPLADS) నిధుల దుర్వినియోగంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు చేసిన ఫిర్యాదు మేరకు ప్రధాని కార్యాలయం స్పందించిందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాస్తున్నట్టు కేంద్ర గణాంకశాఖ స్పష్టం చేసింది.

    ఏం జ‌రిగింది..
    ఎంపీలాడ్స్‌ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుంటూరు (Guntur) జిల్లా బాపట్లలోని ఓ చర్చి నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.86 లక్షలు ఖర్చు చేశారని, చాలా చోట్ల ఇదే తరహాలో వ్యయం చేశారని నరసాపురం ఎంపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీ నుంచి వివరణ కోరాల్సిందిగా కేంద్ర గణాంక మంత్రిత్వశాఖకు పీఎంఓ ఆదేశాలు ఇచ్చింది.

    Andhra Pradesh: జైలు నుంచి విడుద‌ల‌.. ఆపై మాయం.. టీడీపీ నేత పట్టాభి అదృశ్యం.. ఏం జ‌రుగుతోంది!


    ఎంపీలాడ్స్‌ నిధుల ఖర్చులను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర స్థాయి నోడల్‌ విభాగం, జిల్లా అధికారులు నిబంధనలు పాటించకపోవడాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సమగ్రమైన వాస్తవిక నివేదికతో పాటు, ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై కూడా నివేదిక అందజేయాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆదేశించింది.

    నిబంధ‌న‌ల‌కు విరుద్ధం..
    మార్గదర్శకాల ప్రకారం ఎంపీ లాడ్స్‌ నిధులను మతపరమైన సంస్థలకు ఖర్చుచేయడం, ఆయా సంస్థలు, గ్రూపులకు చెందిన స్థలాల్లోనూ నిర్మాణాలు చేపట్టడం కుదరదని పేర్కొంది. అంతేకాదు, ఎటువంటి కట్టడాల పునర్మిర్మాణం, మరమ్మతులకు ఈ నిధులను వినియోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించింది. ఎంపీలాడ్స్‌(MPLADS) నిధుల వినియోగం, ఖర్చులపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏడాదికి ఒకసారైనా సమావేశం కావాలని కేంద్రం సూచించింది. ఈ అంశానికి సంబంధించి అన్ని నోడల్‌ విభాగాలతోనూ సమావేశం నిర్వహించి దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేసింది. అంతేకాదు, వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు, పనులు ఉన్నాయా? లేదా? అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.
    Published by:Sharath Chandra
    First published: