ఏపీ కొత్త రాజధానిగా దొనకొండ..? మూడు నెలలుగా జోరుగా భూముల కొనుగోళ్లు...

Andhra Pradesh : వైసీపీ అధికారంలోకి వస్తే, ఏపీలో శాశ్వతంగా ఉండేందుకు వైసీపీ నేతలు దొనకొండను ఎంచుకోవడంతో... అదే ప్రాంతాన్ని ఇప్పుడు రాజధానిగా మార్చబోతున్నారనే అంశం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 6:01 AM IST
ఏపీ కొత్త రాజధానిగా దొనకొండ..? మూడు నెలలుగా జోరుగా భూముల కొనుగోళ్లు...
దొనకొండ మ్యాప్ (Image : Google Maps)
  • Share this:
ప్రకాశం జిల్లాలో కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది దొనకొండ. ఊరి మధ్యలో రైల్వే ట్రాక్. చుట్టూ ఖాళీ భూములు... అక్కడక్కడా ఇళ్లు, పచ్చదనంతో ఆకట్టుకుంటుంది దొనకొండ. అద్దంకి రోడ్డులో వెళ్తే దొనకొండ నుంచీ ఒంగోలు వంద కిలోమీటర్ల లోపే ఉంది. ఇంకాస్త ముందుకి వెళ్తే... సేద తీర్చేందుకు సముద్రమూ ఉంది. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు దొనకొండ నచ్చకుండా ఎలా ఉంటుంది? అందుకే వైసీపీ నేతల దృష్టి దొనకొండపై పడింది. తాము అధికారంలోకి వస్తే... ఏపీలో ఎక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచించిన నేతలు... దొనకొండను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచే అక్కడి భూములు కొనేందుకు వైసీపీ నేతలు ఆసక్తి చూపారు. తమ అనుచరులను పంపి... దొనకొండలో రియల్టర్లతో బేరసారాలు నడిపారు. హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు... విజయవాడ నుంచి కూడా చాలా మంది వైసీపీ నేతలు... దొనకొండలో ఎన్ని ఎకరాలు కొనుక్కోవాలనే అంశంపై ఎవరికి వాళ్లు లెక్కలేసుకున్నారు. దాంతో ఆటోమేటిక్‌గా ఎన్నికల నాటి నుంచీ దొనకొండలో భూముల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే దొనకొండను రాజధానిగా మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే... దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

donakonda, ongole, prakasham district, amaravati,ap capital amaravati,amaravathi,ap news,ap capital amaravathi,amaravati development,ap politics,ap,ap cm,ap capital amaravathi t,ap capital amaravati mega projects,amaravati roads,amravati,amaravati news,ap capital amaravathi to shift to donakonda,situation of ap capital amaravati development,amaravati updattes,chandrababu,amaravathi vastu,amaravathi roads,jagan to shift ap capital amaravati to donakonda?,అమరావతి తరలింపు, రాజధాని తరలింపు, అమరావతి న్యూస్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, బొత్స కామెంట్స్, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, దొనకొండ, ఒంగోలు, ప్రకాశం జిల్లా,
దొనకొండ మ్యాప్ (Image : Google Maps)

దొనకొండ ఎందుకు : రాయల సీమ ప్రజలకు అమరావతి కంటే దొనకొండ చాలా దగ్గర. అమరావతి చుట్టూ ఆల్రెడీ టీడీపీ నేతలు భూములు కొనేసుకున్నారని మండిపడుతున్న వైసీపీ... రాజధాని విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దొనకొండకు దగ్గర్లోనే రాజధానిని నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకోవడానికి మరో కారణం కూడా ఉంది. 2014లోనే వైసీపీ నేతలు దొనకొండలో కొన్ని భూములు కొనుక్కున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే... దొనకొండ పేరు జోరుగా వినిపించడం మొదలైంది. ప్రచారమే గనక నిజమైతే... ఏపీ రాజధాని అమరావతి బదులు... దొనకొండ అయ్యే అవకాశాలున్నాయి. కానీ... ఇది ప్రచారం మాత్రమే కాబట్టి... దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైసీపీ నేతలు.

donakonda, ongole, prakasham district, amaravati,ap capital amaravati,amaravathi,ap news,ap capital amaravathi,amaravati development,ap politics,ap,ap cm,ap capital amaravathi t,ap capital amaravati mega projects,amaravati roads,amravati,amaravati news,ap capital amaravathi to shift to donakonda,situation of ap capital amaravati development,amaravati updattes,chandrababu,amaravathi vastu,amaravathi roads,jagan to shift ap capital amaravati to donakonda?,అమరావతి తరలింపు, రాజధాని తరలింపు, అమరావతి న్యూస్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, బొత్స కామెంట్స్, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ,  దొనకొండ, ఒంగోలు, ప్రకాశం జిల్లా,
ప్రకాశం జిల్లా మ్యాప్
ఒకవేళ దొనకొండ దగ్గర్లో రాజధానిని ప్రకటిస్తే, అక్కడి భూముల రేట్లు నాలుగైదు రెట్లు పెరిగే అవకాశాలున్నాయి. చిత్రమేంటంటే... దొనకొండతో పోల్చితే ఒంగోలు ఇంకా మేలు. అది సముద్రానికి దగ్గరగా ఉండటమే కాక... ప్రకాశం జిల్లా కేంద్రం కూడా. అక్కడ కూడా చుట్టుపక్కల భూములున్నాయి. అయినప్పటికీ... వైసీపీ నేతలు మాత్రం దొనకొండే రాజధాని అవుతుందన్న నమ్మకంతో అక్కడే భూములు కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దొనకొండలో ఎకరం రూ.15 నుంచీ రూ.20 లక్షల దాకా పలుకుతోంది. తాజా ప్రచారంతో... అది మరింత పెరిగే అవకాశాలున్నాయి.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>