• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH CAG REPORT FOR 2017 18 IDENTIFIES FINANCIAL INDISCIPLINE IN TDP RULE BA

2017-18పై కాగ్ రిపోర్టు... టీడీపీ పాలనలో లోపాల చిట్టా..

2017-18పై కాగ్ రిపోర్టు... టీడీపీ పాలనలో లోపాల చిట్టా..

CAG

  • Share this:
    2017 - 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్టును కాగ్ సమర్పించింది. ఈ రిపోర్టు అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ ఏడాది టీడీపీ పాలన అంతా అప్పులు చేసి దుబారా చేసినట్టుగా కాగ్ ఆక్షేపించింది. ఆర్థిక నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నివేదికలో పొందుపరిచింది. 2018 మార్చి నాటికి అప్పులు రూ. 2,23,706 కోట్లకు పెరిగాయని.. ఆ మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. చేసిన అప్పులు చాలక.. రిజర్వు బ్యాంకు నుంచి 231 రోజులు చేబదులుగా, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రూ. 45,860.75 కోట్లు తీసుకొని.. వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల రూ. 44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందంటూ కాగ్ నివేదికలో ప్రముఖంగా పేర్కొంది. అంటే, ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కారు వైఫల్యానికి ఇదో తార్కాణమని కాగ్‌ పేర్కొంది.

    కాగ్ నివేదికలో ప్రధాన అంశాలు...

    • 2015–16 నుంచి 2017–18 మధ్య కాలంలో ద్రవ్యలోటును అదుపు చేయడంలో విఫలం.

    • అప్పులు చేసి ఆస్తులు కల్పించాల్సిన సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరించింది. దుబారా ఖర్చులు చేసి.. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేసింది. దీనివల్ల మార్చి 2018 నాటికి భారం రూ. 2,23,706 కోట్లకు పెరిగింది.

    • తీసుకున్న రుణాలతో పోలిస్తే తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్పత్తి 2016–17లో 18.27 శాతం నుంచి 2017–18లో 22.51 శాతానికి పెరిగింది.

    • కొత్తగా చేసిన అప్పులను పాత అప్పులు తీర్చడం కోసం మళ్లించారు. దీనివల్ల రాబోయే ఏడేళ్లలో తీర్చాల్సిన రుణం రూ. 91,599.32 కోట్లకు పెరిగింది.


    శాఖల వారీగా ఖర్చు చేయని నిధులు వివరాలివీ ( రూ.కోట్లలో)

    రెవెన్యూ కేటాయింపులు :

    1. క్రీడలు, యువజనసేవల శాఖకు 2017–18లో రూ.8,44.59 కోట్లు కేటాయించారు. ఖర్చు రూ. 295.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.549.04 కోట్లు మిగిలాయి.

    2. మున్సిపల్‌ శాఖకు రూ. 5,014.09 కోట్లు కేటాయించగా.. రూ. 3,719.53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ. 1,294.56 కోట్లు మిగిలాయి.

    3. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 16,787.73 కోట్లు కేటాయించగా.. రూ. 13,272.25 కోట్లు ఖర్చు చేసింది.


    కేపిటల్‌ కేటాయింపులు :

    • రోడ్లు, భవనాల శాఖకు రూ. 3,649.16 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది.. రూ. 914.17 కోట్లే. రూ. 2,734.99 కోట్లు మిగిలాయి.

    • మున్సిపల్‌ శాఖకు రూ. 2,120.18 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది రూ. 535.44 కోట్లు. రూ. 1,584.74 కోట్లు ఖర్చు చేయలేదు.

    • పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 1,900.81 కోట్లు కేటాయించగా.. రూ. 1,164.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ. 736.68 కోట్లు ఖర్చు చేయలేదు.

    • భారీ నీటిపారుదల శాఖకు రూ. 16,051.13 కోట్లు కేటాయించగా.. రూ.6,874.29 కోట్లు ఖర్చు చేశారు. రూ. 9,176.84 కోట్లు ఖర్చు చేయలేదు.

    • చిన్ననీటి పారుదల శాఖకు రూ. 2,868.94 కోట్లు కేటాయించగా... రూ. 1,382.13 కోట్లు ఖర్చు చేశారు. రూ. 1,486.81 కోట్లు ఖర్చు చేయలేదు.

    • ఆర్థిక పాలన, ప్రణాళి, సర్వేలకు రూ. 22,863.38 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది రూ. 21,808.14 కోట్లు. ఖర్చు చేయనిది రూ. 1,055.24 కోట్లు.

    • పాఠశాల విద్యకు రూ.18,950.69 కోట్లు కేటాయించగా.. రూ.16,909.17 కోట్లు ఖర్చు అయింది. రూ. 2,041.52 కోట్లు ఖర్చు చేయలేదు.

    • మొత్తం 10 శాఖలకు 91, 050.7 కోట్లు కేటాయించి కేవలం 66 , 874 .7 కోట్లు ఖర్చు చేసారు. అంటే మిగిలిన 24 ,175 .96 కోట్లు ఖర్చు చేయలేదు.

    • 2017-18 సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్‌లో మొత్తం అన్ని శాఖలకు కేటాయించిన నిధుల కంటే రూ. 34,602.10 కోట్లు త‌క్కువ ఖ‌ర్చు చేశారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: