ANDHRA PRADESH CABINET WILL MEET ON FEBRUARY 23RD MAY GIVE CLARITY ON ASSEMBLY BUDGET SESSION AND EXECUTIVE CAPITAL VISAKHAPATNAM HERE ARE THE DETAILS PRN
AP Cabinet Meet: కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్.. ఆ రెండు విషయాలపై క్లారిటీ ఇస్తారా..?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ (AP Cabinet) సమావేశం నెల 23న జరగనుంది. అమరావతి (Capital Amaravathi) సచివాలయంలో (AP Secretariat) జరగనున్న సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS JaganmohanReddy) అధ్యక్షత వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నెల 23న జరగనుంది. అమరావతి సచివాలయంలో జరగనున్న సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్నందున ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చించే అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఆదిత్యానాథ్ దాస్.. ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనే చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే అసెంబ్లీపై క్లారిటీ వచ్చే ఛాన్సుంది. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ డోర్ డెలివరీ జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన చర్చకు వచ్చే అవకాశముంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా కేబినెట్ భేటీ అజెండాలో ఉండనుంది. ఈ విషయంలో ప్రభుత్వపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించే అవకాశముంది. అలాగే మంత్రుల అభిప్రాయాలను కూడా సీఎం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానించే అంశంపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ అంశంపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం అందిస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా చర్చించవచ్చు.
ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల అంశాలు కూడా చర్చకు రానున్నాయి. పంచాయతీలు ఏర్పడటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రామాల్లో అభివృద్ధి పనులపై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టే అవకాశముంది. అలాగే మార్చిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, ఏర్పాట్ల అంశం చర్చకు రావచ్చు.
మరోవైపు వీలైనంత త్వరగా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ కేబినెట్ భేటీ కీలకంగా మారనుంది. ఉగాది నాటికి కార్యానిర్వాహక రాజధానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే రోజు వైజాగ్ లో సీఎం క్యాంప్ ఆపీస్ ప్రాంభిస్తారనే ప్రచారం జరుగతోంది. కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తే తరలింపు ప్రక్రియ ఏ విధంగా ఉండాలని, ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే అంశం చర్చకు వచ్చే అవకాశముంది. దీంతో పాటు రానున్న వేసవిలో నీటి ఎద్దడి, పెండింగ్ ప్రాజెక్టులు, మార్చిలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల వంటి వాటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.