M BalaKrishna, Hyderabad, News18. AP New Minsters list: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కేబినేట్ విస్తరణ వార్తలు ఎప్పుడు తెరపైకి వచ్చినా.. మంత్రుల్లో టెన్షన్ పెరుగుతుంది. అయితే కొత్తగా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి.. నూతన జిల్లా ఏర్పాటు మరింత జోష్‌ను పెంచుతున్నాయి. 2019 ఎన్నికలల్లో భారీ విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.. అప్పుడే మంత్రివర్గం విస్తరణపై క్లారిటీ ఇచ్చారు.. రెండేళ్ళ పాటు ఈ మంత్రి వర్గ విస్తరణ కొనసాగుతుందని, ఆ స్ధానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నట్లు సీఎం అప్పుడే చెప్పారు. నాటి నుండి నేటి వరకూ సీఎం చూపును తమపై పడేలా చేసుకునేందుకు కొందరు ఎమ్మెల్యే చేయని ప్రయత్నం లేదు. కొందరు ఎమ్మెల్యే పడరాని పాట్లు పడ్డారు.. పడుతూనే ఉన్నారు. నిత్యం ప్రజల దగ్గరే అధిక సమయం గడుపుతూ.. సీఎంను కలిసిన ప్రతిసారి తమ మనస్సులో మాటలను చెప్పేవారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు ఎవరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరెవరికి స్ధానం కల్పచాలనేది మాత్రం జగన్ ముందే ఫైనల్ని చేసినట్టు.. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చజరుగుతోంది.
అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు పూర్తి అయ్యి మూడేళ్ళు అవుతుంది.. కానీ ఇప్పటి వరకు కొత్త కేబినెట్ విస్తరణపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించలేదు. ఎందుకంటే కోవిడ్ కారణంగా మంత్రులు అంతా తమ తమ శాఖలపై సరైన దృష్టి పెట్టలేకపోయారు. మరికొద్ది నెలల పాటు కేబినెట్ విస్తరణ పొడిగిస్తున్నట్లు స్వయంగా సీఎం నిర్ణయం తీసుకున్నారు.. వాస్తవానికి ఫిబ్రవరి, మార్చి నెలలో కేబినెట్ విస్తరణ జరుగవచ్చని అందరూ భావించినా.. మే 31వ తేదీన మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మంత్రుల్లో చర్చ జరుగుతుంది..
ఇదే సమయంలో కొత్త జిల్లా ఏర్పాటు వేగవంతంగా జరుగుతుంటే.. ఉగాది నాటికి కొత్త జిల్లా పరిపాలన కొనసాగించాలని సీఎం యోచిస్తున్నారు. అదే తరహాలో చక చక కొత్త జిల్లాలో పరిపాలనకు సంబంధిన భవనాల పరిశీలన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.. మొదటి నుంచి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తమకే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని తమ సన్నిహితులతో అంటున్నారు.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త మంత్రుల లిస్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక జిల్లాల వారిగా చూస్తే..
ఇదీ చదవండి : ఫ్యాన్ కు రిపేరు చేస్తారా..? పార్టీ లైన్ దాటుతున్న నేతలపై విజయసాయి ఫోకస్
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా నుండి ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.. తమ్మినేని స్ధానంలో వేరోకరికి స్పీకర్ బాధ్యతలు అప్పగించి తమ్మినేనికి మంత్రి వర్గంలో స్ధానం కల్పించాలని సీఎం అనుకుంటున్నారని సమాచారం.. రెండో స్ధానంలో ధర్మానప్రసాద్ కూడా మంత్రి వర్గం పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి స్ధానం దక్కుతుంతో అనేది వేచి చూడాలి..
ఇదీ చదవండి : ఆ ఎమ్మెల్యే కన్ఫ్యూజ్ లో ఉన్నారా..? కన్ఫ్యూజ్ చేస్తున్నారా..? ఇంతకీ ఆయన దారెటు..?
విజయనగరం (Vizianagaram) జిల్లా నుంచి రాజన్నదొర ముందు వరుసలో ఉండగా.. కోలగట్ల వీరభద్ర స్వామికి కూడా స్ధానం దక్కె సూచనలు కనిపిస్తోంది.. తూర్పు గోదావరి (East Godavari)జిల్లా నుండి ముగ్గురు రేసులో ఉండగా.. కాపు సామాజిక వర్గం నుండి దాడిశెట్టి రాజా, బీసీ సామాజిక వర్గం నుండి పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.. పశ్చిమ గోదావరి (West Godavari) నుండి క్షత్రియ కోటాలో ప్రసాద్ రాజు, గ్రంధి శ్రీనివాసు, బాలరాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి..
కృష్ణా (Krishna) జిల్లా నుండి పార్థసారథి కచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కె అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.. జోగి రమేష్, సామినేని ఉదయభాను పేర్లు కూడా పై చర్చ జరుగుతోంది. గుంటూరు (Guntur)జిల్లా నుండి అంబటి రాంబాబు ఉండగా, బిసీ వర్గం నుండి జంగా కృష్ణమూర్తి, అళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. ప్రకాశం (Prakasham) జిల్లా నుండి మహీధర్ రెడ్డి, అన్నా రాంబాబు, సుధాకర్ బాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నెల్లూరు (Nellore) జిల్లా నుండి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
చిత్తూరు (Chitoor) జిల్లాలో ఆదిమూలం, ద్వారకనాథరెడ్డి,ఆర్.కే.రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప (Kadapa) జిల్లా నుండి కోరుముట్ల శ్రీనివాసులు, సి.రామచంద్రయ్య, ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు పేర్లు వినిపిస్తున్నాయి..
ఇదీ చదవండి : సర్కారు వారి చేపలు.. ఇకపై ఇంటి ముందుకే తాజా నోరూరించే చేపలు, రొయ్యలు, పీతలు
కర్నూలు (Kurnool) నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.. అనంతపురం (Anantapuram) నుండి అనంత వెంకటరామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ఉష శ్రీచరణ్, రామచంద్రారెడ్డి జొన్నలగడ్డ పద్మావతిలు మంత్రి పదవి రేసులో ఉండగా.. ఇక్కడ బిసి, రెడ్డి సామాజిక వర్గాలకు అవకాశం దక్కె సూచనలు అధికంగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.