హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పీఆర్సీ వివాదం.. కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయాలు..!

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పీఆర్సీ వివాదం.. కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయాలు..!

ప్రతికాత్మకచిత్రం

ప్రతికాత్మకచిత్రం

Andhra Pradesh Cabinet meeting: ఏపీలో పీఆర్సీ రగడ భారీ ఉద్యమంగా మారుతోంది. కరోనా కేసుల సంఖ్య 12 వేల మార్కు దాటింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా ఏపీ కేభినెట్ నేడు సమావేశం కానుంది. కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

Andhra Pradesh Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy ) అధక్షతన జరిగే  ఈ సమావేశంలో ప్రధానంగా  పీఆర్సీపై ఉద్యోగల నిరసనలు (PRC Fight), ఉద్యమ ప్రభావం, రాష్ట్రంలోకరోనా వైరస్ (Corona Virus) పరిస్థితులు.. ఏపీ సినిమా టికెట్ల రేట్ల ధరల అంశం (AP online movie tickets issue ),  సంక్షేమ పథకాలు..  కేంద్రం వ్యవహరిస్తున్న తీరు.. రాష్ట్రంలో నిధుల సమస్య.. జగనన్న స్మార్ట్ టౌన్ నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశమే చాలామంది మంత్రులకు ఆఖరి కేబినెట్ భేటీ అంటూ వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీ తరువాత కొన్ని రోజుల్లో కేబినెట్ ప్రక్షాళణ ఉంటుందని.. ఇప్పటికే సీఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. చాలామంది మంత్రులకు.. ఆ పదవిని తప్పించి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని.. కొత్తవారిని మంత్రి మండలిలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పీఆర్సీ ఉద్యమంపై ప్రధాన చర్చ..                                                                       ప్రధానగా ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగుల నిరసనలు, సమ్మెకు వెళ్లే అవకాశం ఉండడంతో దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇఫ్పటికే అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ట్రెజరీ ఉద్యోగులు కూడా సహాయనిరాకరణ ప్రారంభించారు. దీంతో ఈ నెల జీతాలు కూడా పడే పరిస్థితి లేదు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే పాలన స్తంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను  ఎలా ఒప్పించాలి.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని కొనసాగించడమా.. లేక జీవోలను రద్దు చేయడమా.. తదితర అంశాలపై నేడు కేటినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో అమ్మవారి కళ్లు.. భక్తితో పూజలు చేసిన ప్రజలు

థర్డ్ వేవ్ ప్రభావం.. స్కూళ్లకు సెలవులు..                                                                  ప్రస్తుతం ఏపీలో కరోనా పంజా విసురుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో కేసులు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 12 వేలు దాటేసింది. రికవరీలు క్రమంగా పెరుగుతున్నా.. కొత్తకేసుల సంఖ్య మాత్రం భారీగా ఉంటోంది. తాజాగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 26 శాతం దాటింది. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసులు తగ్గడం లేదు. దీంతో కఠిన విధించే దిశగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని.. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉదపాధ్యాయులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఉద్దేశం లేదని చెబుతోంది. దీనిపై ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : ఎమ్మెల్యే మిస్సింగ్ ఆంటూ పోస్టులు.. కరోనా భయం లేనివారు ఇంటికి రావాలంటూ పద్మావతి కౌంటర్

సినిమా టికెట్ల ధరల వ్యవహారం..                                                                            ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ మారిన మరో వ్యవహారం సినిమా టికెట్ల ధరలు. సినిమా పెద్దల నుంచి ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మంత్రులు, నేతలు, టాలీవుడ్ దర్శకులు, హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలతో పరిస్థితి హీటెక్కించారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సీఎం జగన్ లంచ్ భేటీ నిర్వహించారు. టికెట్ల రేట్ల వ్యవహరాంలో పునరాలోచిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది..


ఇదీ చదవండి : ఆ నియోజకవర్గంలో ఢీ అండే ఢీ.. ఆస్తుల లెక్కలపై ఇరు పార్టీ నేతల సవాళ్లు..

ఇదే లాస్ట్ మీటింగ్..  ఏపీలో సంక్షేమ పథకాలు అమలు.. కొత్త పథకాలు.. వాటికి కావాల్సిన నిధులు, కేంద్రం నుంచి ఎదురవుతున్న సమస్యలు, నిధులు ఇవ్వడంలో కేంద్రం వైఖరి తదితర అంశాలను ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారు. అయితే ఏపీలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చాలామంది మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఎందుకంటే సీఎం జగన్ ఇప్పటికే మంత్రులు చాలామందిని తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేడో రేపో దీనిపై ప్రకటన చేస్తారని సమాచారం. సీనియర్ మంత్రులను ఆ పదవుల నుంచి తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్.. దీనిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News

ఉత్తమ కథలు