AP New Distircts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక అడుగు పడింది. రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల వివరాలను ప్రభుత్వం మంత్రులకు పంపింది. ఆన్ లైన్ లో సమావేశమైన మంత్రివర్గం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తాజాగా కేబినెట్ ఆమోదం తెలపడంతో.. దీనికి సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గతంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ, అమిత్ షాల దగ్గర అనుమతి తీసుకున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) జిల్లాల పునర్విభజనపై పూర్తి నివేదికలు తెప్పించుకున్న తరువతే.. ప్రక్రియ ప్రారంభమైనట్టు సమాచారం. ఇటీవల వైఎస్ఆర్సీపీ (YSRCP) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే కొత్త జిల్లాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న13 జిల్లాలకు మరో13 జిల్లాలు కొత్తగా యాడ్ అవ్వనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి ప్రణాళిక కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందించారు. కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం రేపే కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఏపీకి 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆయా లోక్ సభ నియోజకవర్గాలన్నీ రాష్ట్రాలు కానున్నాయి. అయితే అరకు పార్లమెంట్ పరిది పెద్దదిగా ఉండడంతో దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.
ఇదీ చదవండి : గిరి దేవత శంబర పోలమాంబ.. సిరిమానోత్సవానికి పోటెత్తిన భక్తులు..
ప్రస్తుతం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పనులు ముగిశాయని, సరిహద్దులు అన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని సమాచారం. ఇక, అధికారికంగా నోటిఫికేష్ ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందే వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.