Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH BUS ACCIDENT IN AHOBILAM KURNOOL DISTRICT BUS FALL IN VALLY 10 INJUERD NGS TPT

RTC Bus Accident : అహోబిలంలో రోడ్డు ప్రమాదం.. లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. 10మంది తీవ్రగాయాలు

అహో బిలంలో బస్సు ప్రమాదం

అహో బిలంలో బస్సు ప్రమాదం

Road accident: ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదం భయపెట్టింది. అహోబిలం దర్శనానికి వెళ్లిన భక్తులు తిరిగి వస్తున్న సమయంలో.. ఆ బస్సు లోయలో పడింది. లక్కీ గా ఎవరి ప్రాణాలకు అపాయం లేకుండా బయటపడ్డారు. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Ahobilam Rtc Bus Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఇటీవల బస్సు ప్రమాదాలు (Buss Accidents) రోజు రోజుకూ భయపెడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా (kurnool District)లో ప్రతి నెల రోడ్డు ప్రమాదాల గురించి వార్తలు విపిస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కోసారి ప్రాణాపాయం లేకుండా లక్కీగా అందరూ బయటపడుతున్నారు. కానీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.. రోజు రోజుకూ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. మనుషుల నిర్లక్ష్యమా.. లేక అధికారుల సరైనా చర్యలు తీసుకోకపోవడమా.. కారణం ఏదైనా వరుస ప్రమాదాలు మాత్రం కర్నూలు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా మరో భారీ ప్రమాదం తప్పింది.. కర్నూలు జిల్లాలోని అహోబిలం దగ్గర ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడినా.. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎగువ అహోబిలం రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (Rtc Bus) లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది...

    ఆళ్లగడ్డ నుంచి అహోబిలం క్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికులు, గాయపడ్డ వారి సమాచారం మేరకు.. అంతా అహోబిలంలో దర్శనాలు పూర్తి చేసుకున్న తరువాత... ఇక త్వరగా ఇంటికి చేరుకోవాలని అంతా తొందర పడుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సు.. తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది అంటున్నారు. వాహనాన్ని పార్కింగ్ నుంచి వెనక్కు తిప్పే ప్రయత్నంలో.. డ్రైవర్ దూరాన్ని అంచానా వేయలేకపోవడంతో కొద్ది క్షణాల్లోనే బస్సు అదపు తప్పిలోయలో పడినట్టు తెలుస్తోంది. బస్సుతో సైతం అలా అంతా లోయలో పడినా అంతా గాయాలతోనే బయటపడ్డారు. గాయపడిన వారిని బయటకు తీసి రెండు అంబులెన్సుల ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    ఇదీ చదవండి :ఒమిక్రాన్ తరుముకొస్తోంది.. నిర్లక్ష్యం వద్దు మిత్రమా.. మాస్క్ మస్ట్ అని గుర్తించండి..

    ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయకచర్యలు చేట్టారు. గాయపడివారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ప్రమాదానికి కారణం ఏంటి అన్నదానిపై పోలీసులు అరా తీస్తున్నారు. అక్కడ లోయ ఉందని తెలిసినా డ్రైవర్ అంత నిర్లక్ష్యంగా ఎందుకు వెనక్కు తిప్పాల్సి వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు స్థానిక అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోయ ఉందనే హెచ్చరిక బోర్డులు పెట్టడం కానీ.. లేద బస్సు లోయలో లేకుండా చిన్న వాల్స్ లాంటివి కానీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అధికారులు కళ్లు తెరిచి ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bus accident, Crime news, Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు