AP Budget Session 2023-24 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జె్ట్ సమావేశాలు మార్చి 14, 2023న ప్రారంభం కానున్నాయి. 17న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఈసారి బడ్జెట్ రూ.2 లక్షల 60 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి... ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఇందులో సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది.
వచ్చే సంవత్సరం ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టగలదు. ఏప్రిల్ 2024న అటు లోక్ సభకు, ఇటు ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రభుత్వానికి కీలకం కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేస్తారని తెలిసింది. నాలుగేళ్ళ పాలన, మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ వంటి ముఖ్యమైన అంశాలతో ప్రభుత్వ ఎజెండా ఉంటుందని సమాచారం.
ఈ నెల 14న (మంగళవారం) గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై విపక్షాలతో బీఏసీ సమావేశంలో ప్రభుత్వం చర్చిస్తుంది. ఈ నెల 27 వరకు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy