AP Budget: విద్య, వైద్య రంగాలకు ఏపీ ప్రభుత్వం పెద్ద పీట.. బడ్జెట్ కేటాయింపులు ఇవే

ఏపీ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వైద్య, విద్యారంగాలకు అదిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా కరోనా పోరాటానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. అలాగే నవరత్నల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. ఏ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఈ సారి ఏపీ ఫ్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధికంగా కేటాయింపులు చేశారు.  2021-22 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం  2,29,779.27 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలను రూపొందించినట్లు బుగ్గన వివరించారు. ఈ బడ్జెట్‌లో వెనుకబడిన కులాలకు రూ.28,237 కోట్లు కేటాయించామన్నారు. 2020-21తో పోలిస్తే వారికి 32 శాతం అధికంగా కేటాయింపులు చేసినట్లు చెప్పారు. బడ్జెట్ చదువుతున్నంత సేపు.. మధ్య మధ్యలో కవితలు.. పద్యాలు చెపుతూ కేటాయింపులను వివరించారు బుగ్గన..

    2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా 2,29,779.27 కోట్ల రూపాయాలు కాగా.. అందులో రెవన్యూ వ్యయం లక్షా 82 వేల 196 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వ్యయం 47,582 కోట్ల రూపాయలుగా చెప్పారు. రెవెన్యూ లోటు 5 వేల కోట్ల రూపాయలు ఉందన్నారు. అలాగే ద్రవ్యలోటు 37,029.79 కోట్ల రూపాయాలు ఉందన్నారు ఆర్థిక మంత్రి. జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం కాగా.. రెవెన్యూ లోటు 0.47 శాతం ఉందన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన..

    వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.

    సామాజిక వర్గాల వారిగా కేటాయింపులు ఇవే..

    బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు
    కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
    ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
    బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
    ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
    ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
    మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు

    చిన్నారులు.. మహిళ కోసం ప్రత్యేక బడ్జెట్

    చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
    మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు

    వివిధ రంగాలకు కేటాయింపులు ఇవే..

    వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
    విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
    వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
    వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు
    వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు
    జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
    జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు
    వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు
    డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
    పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
    రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
    వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
    వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
    వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
    వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
    వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
    మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
    అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
    రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
    లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
    ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
    వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
    అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
    వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
    రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
    వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
    వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
    వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
    వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు
    విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
    స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
    జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
    జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
    ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
    ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
    ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
    ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు
    కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు
    ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు
    శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు
    హౌసింగ్‌, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు
    పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు
    ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు
    కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.250 కోట్లు
    ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు
    ఎంఎస్‌ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు
    పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు
    రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు
    ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు
    వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
    వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు
    దిశ కోసం రూ.33.75 కోట్లు
    అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు
    వైఎస్‌ఆర్‌ బీమాకు రూ.372.12 కోట్లు
    అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు
    ఇమామ్‌, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
    పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు
    ల్యాండ్‌ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు
    పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు
    నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు
    Published by:Nagesh Paina
    First published: