Andhra Pradesh: సరదాగా బైక్ పై వెళ్లిన అక్కాతమ్ముళ్లు.. అంతలోనే విషాదం.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: మైనర్ బాలిక అందునా ఇద్దర్ని బైక్ ఎక్కించుకొని వెళ్తున్నా తల్లిదండ్రులు మాత్రం వారించలేదు. చివరకి వారికి తీరని కడుపుకోత మిగిలింది.

  • Share this:
    చిన్నపాటి నిర్లక్ష్యం, వేగంగా వెళ్లాలన్న సరదా.. ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మోపిదేవి మండల కేంద్రంలోఓ బైక్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే మోపిదేవి మండలం గంజివారి పాలెంకి చెందిన తురకా శ్రీనివాసరావుకు కుమార్తె నాగలక్ష్మి (16), కుమారుడు జస్వంత్ (12) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాగలక్ష్మికి బైక్ నడపడం అంటే సరదా... తన తమ్ముడు జస్వంత్ తో పాటు మరో బాలుడ్ని ఎక్కించుకొని మోపిదేవి వార్పు వద్దకు వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు వారిని క్రాస్ చేసి ముందకెళ్లింది. దీంతో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు యత్నించారు.

    ఈ క్రమంలో మోపిదేవి గురుకుల పాఠశాల వద్దకు రాగానే స్పీడ్ లో బైక్ కంట్రోల్ కాకపోవడంతో అదుబతప్పి కిందపడిపోయారు. దీంతో బస్సు వెనుక చక్రాలు కింద పడి అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలుడికి తీవ్రగాయాల కావడంతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

    చిన్నవయసులోనే కూతురు బైక్ నడుపుతుండటంతో మురిసిపోయిన శ్రీనివాసరావు ఒకే ప్రమాదంలో ఇద్దరి పిల్లల్ని కోల్పోవడంతో షాక్ కు గురయ్యాడు. పిల్లల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు గుండలవిసేలా రోదిస్తున్నారు. చిన్నపిల్లకు బైకులు ఇవ్వొద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. మైనర్ బాలిక అందునా ఇద్దర్ని బైక్ ఎక్కించుకొని వెళ్తున్నా తల్లిదండ్రులు మాత్రం వారించలేదు. చివరకి వారికి తీరని కడుపుకోత మిగిలింది. తల్లిదండ్రులు మైనర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.., 18ఏళ్లు దాటని వారికి, లైసెన్స్ లేనివారికి వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: