Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH BLAST OCCURRED NEAR BHIMAVARAM AHEAD OF CM YS JAGAN MOHAN REDDY TOUR HERE IS THE DETAILS AK

భీమవరంలో సమీపంలో పేలుడు.. ఆవుకు గాయాలు.. సీఎం జగన్ పర్యటనకు ఒక రోజు ముందే..

పేలుడు కారణంగా గాయపడిన ఆవు

పేలుడు కారణంగా గాయపడిన ఆవు

AP News: ఏపీ సీఎం జగన్ రేపు భీమవరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ఒక రోజు ముందే ఈ రకంగా పేలుగు జరగడం చర్చనీయాంశంగా మారింది.

    పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పేలుడు జరగడం కలకలం రేపింది. భీమవరం ఉండి రోడ్‌లోని ఖాళీ స్థలంలో ఓ ఆవు మేత మేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఆవుకు గాయాలయ్యాయి. ఏపీ సీఎం జగన్ రేపు భీమవరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ఒక రోజు ముందే ఈ రకంగా పేలుగు జరగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులు, పోలీసులు ఈ పేలుడు ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. ఆ పరిసరాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే ఈ పేలుడుకు కారణం ఏంటనే విషయం ఉన్నతాధికారులు వస్తే తప్ప క్లారిటీ రాదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. గాయపడిన ఆవుకు చికిత్స అందించిన పోలీసులు.. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో కొంత మేర భూమి చెల్లాచెదురైంది. ఎవరైనా రసాయన వ్యర్థాలను ఇక్కడ వదిలివెళ్లారా ? లేక కావాలనే ఈ రకంగా చేశారా ? అనే సందేహాలు మొదలయ్యాయి.

    ఇదిలా ఉంటే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ రేపు భీమవరం రానున్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో భీమవరంలో పోలీసులు భద్రతను పెంచారు. ఈ క్రమంలోనే అక్కడికి సమీపంలో పేలుడు జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bhimavaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు