Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerrjau) కేంద్ర పెద్దలు చెక్ పెడుతున్నారా..? ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంటెద్దు పొకడలు, ఏకపక్ష నిర్ణయాలు.. పార్టీ లోని సభ్యుల అభిప్రాయాలను తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా ఇతర పార్టీ ల నుండి బీజేపీకిలో వచ్చిన నాయకులకు ఆయన సరిగ్గా గౌరవం ఇవ్వడం లేదనే వాదనలు విని పిస్తున్నాయి, వైసీపీ (YCP)ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి పక్షంలో ఉండి కూడా పాలక పక్షం తప్పులు ఎత్తి చూపడంలో విఫలమవుతున్నారని అధిష్టానం నానికి పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా అమరావతి (Amaravati) రాజధాని విషయంలో కూడా మెతక దోరణి వ్యవహరించడం లాంటి ఘటనలతో సోము వీర్రాజుకు బ్రేకులు వేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అదిష్టానం కోర్ కమిటీ నీ సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పిన తరువాత కోరే కమిటీని ప్రకటించారు.
ఇదీ చదవండి : ఏపీ దిశ బిల్లుపై కొర్రీలు పెడుతోందా..? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?
కానీ బీజేపీ అధ్యక్షుడు మాత్రం ఒంటెద్దు నిర్ణయాలు తీసుకుంటున్నారాని.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అంశాల్లో ఇతరులు ఇచ్చిన సూచనలు కూడా పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ పై అంటే ఘాటుగా విరుచుకుపడే సోము.. వైసీపీ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో మాత్రం పూర్తిగా వెనుకబడుతున్నారని అధిష్టానానికి పలువురు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు
ఇటీవల తిరుపతికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం సోము వీర్రాజుకు క్లాస్ పీకినట్టు ప్రచారం జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం తీర్మాణం చేసిన తరువాత.. రాజధాని ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని ఆయన ప్రశ్నించినట్టు తెమలుస్తోంది. మద్యలో ఆయన కలుగజేసుకుని.. అమరావతి ఉద్యమం పెయిడ్ బ్యాచ్ చేస్తోందని ఏదో అనబోతే.. అమిత్ షా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి :సీఎం అవ్వాలన్న ఆశ.. ఆకాంక్ష రెండూ ఉన్నాయి.. టీడీపీతోనే అనుబంధం.. ఆయన మనసులో మాట ఇదే
కేవలం అమరావతి విషయంలోనే కాదు.. రాష్ట్రాంలో పార్టీని పటిష్ట పరచడం కాని.. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి రప్పించడంలో కానీ ఎక్కడ సోమువీర్రాజు పాత్ర కనిపించడం లేదని.. ఆయన వల్ల పార్టీకి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని.. రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కూడా ప్రచారంలో ఉంది. ఆ నివేదిక ఆధారంగానే ఆయనపై వేటు వేయడానికి సిద్ధమైనటు బీజేపీ కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర కోర్ కమిటీలో అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి దుగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవిఎల్ నర్శింహరావు, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) మధుకర్, ఎమ్మెల్సీ పీఎన్వీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి ఉన్నారు.
ఇదీ చదవండి : పీఆర్సీపై మంత్రి క్లారిటీ.. ఉద్యోగ సంఘాలకు నాది భరోసా అంటున్న బొత్స
దీనికి తోడుగా ప్రత్యేక అహ్వానితులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యవేక్షకుడు శివప్రకాశ్, కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్ చార్జి వి మురళీధరన్, సునీల్ ధేవధర్ లు ఉన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Somu veerraju