Kanna vs BJP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఊహించిందే అయినా.. ఎన్నికల ముందు వరకు కన్నా బీజేపీ (BJP) లోనే కొనసాగుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కన్నా అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు.. ఆ లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)కు పంపారు.. అయితే బయట వారి సంగతి ఎలా ఉన్నా.. పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ముందే కాన్నా రాజీనామాను పసిగట్టునట్టు ఉన్నారు. అందుకే కన్నా రాజీనామా చేసిన రోజునే కాపు నేతలతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఎందుకంటే కన్నాకు కాపుసామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది.. ఆయనకు అనుచర బలం కూడా భారీగానే ఉంది. కేవలం గుంటూరు జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సామాజికి వర్గంలో కన్నాకు ఓ ఇమేజ్ ఉంది. అయితే ఆయన పార్టీకి దూరం అయితే.. ఆ సామాజికి వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు.. కేడర్ కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందని ముందే బీజేపీ అలర్ట్ అయ్యింది. అందుకే వెంటనే కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది.
ఓవైపు కన్నా తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తుంటే.. ఉదయం నుంచి ఎంపీ జీవీఎల్ తో కాపు నేతల వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత వంగవీటి రంగా గురించి జాతీయ స్థాయిలో జీవీఎల్ ప్రస్తావించారంటూ కాపు నేతలు జీవీఎల్ ను ప్రశంసించారు. మరోవైపు విజయవాడలో వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీవీఎల్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగు బలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించాను అని గుర్తుచేసుకున్నారు.
భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటనగా పేర్కొన్న ఆయన.. 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారు రంగా అంటూ ప్రశంసలు కురిపించారు.. రాజకీయాలనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరి పేర్లేనా.. మిగిలినవారి పేర్లు కనిపించవా..? అంటూ అటు అధికార పక్షం, ఇటు విపక్షంపై ఫైర్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని సూచించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఇదీ చదవండి : సీఎం నివాసంలో గోశాలను చూసి మైమరచిన చాగంటి.. సీఎం పై ప్రశంసల వర్షం
గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటి రంగా నినాదం ఎత్తుకుంది ఏపీ బీజేపీ.. ముఖ్యంగా కన్నా బలంగా భావించే కాపు నేతలను.. పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలను ముందునుంచే మొదలెట్టారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల నుంచి జీవీఎల్ కాపు నినాదం ఎత్తుకున్నారు. మరోవైపు, జీవీఎల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు కాపు నేతలు.. జీవీఎల్ పార్లమెంటులో రంగా గురించి ప్రస్తావన తేవడం ఆనందంగా ఉందన్నారు వంగవీటి నరేంద్ర.. తాజాగా మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. విజయవాడ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని కోరుతున్నారు. అలాగే జిల్లాకు కూడా రంగా పేరు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మా ప్రయత్నం చేస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Kanna laxminarayana