నేషనల్ టూరిజం అవార్డ్స్ 2017-18 : బెస్ట్ స్టేట్‌గా టాప్‌లో నిలిచిన ఆంధ్రప్రదేశ్

National Tourism Awards 2017-18 : తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇటీవల వాటిని చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఆ క్రమంలో... నేషనల్ టూరిజం అవార్డ్స్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 27, 2019, 1:24 PM IST
నేషనల్ టూరిజం అవార్డ్స్ 2017-18 : బెస్ట్ స్టేట్‌గా టాప్‌లో నిలిచిన ఆంధ్రప్రదేశ్
కైలాసగిరి నుంచీ విశాఖ తీరం (File)
  • Share this:
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెయ్యాలనీ, టూరిజం ప్రదేశాల్లో కాలుష్యం అన్నదే ఉండకూడదని రెండ్రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో... ఏపీ ప్రభుత్వానికి కలిసొచ్చే ప్రకటన ఒకటి కేంద్ర పర్యాటక శాఖ నుంచీ వచ్చింది. 2017-18 సంవత్సరానికి ఇచ్చే జాతీయ పర్యాటక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా... ఈ అవార్డులను ప్రకటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ఇస్తున్నారు. మొత్తం 76 అవార్డులను వేర్వేరు కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్... టూరిజం అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్టేట్‌గా నిలిచి... బెస్ట్ స్టేట్ అవార్డ్ దక్కించుకుంది.

ఏపీ తర్వాత గోవా, మధ్యప్రదేశ్... కలిసి... అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో అవార్డ్ దక్కించుకున్నాయి. ఉత్తరాఖండ్... బెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్-ఫ్రెండ్లీ రాష్ట్రంగా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)ని సరికొత్తగా వాడటంలో విన్నర్‌గా నిలిచి బెస్ట్ స్టేట్‌ అవార్డ్ దక్కించుకుంది.

ఇండియాలో వ్యాపారం చెయ్యడం తేలిక కావడంతో... ఎంతో మంది టూరిస్టులు ఇండియా వస్తున్నారని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులు ఇస్తున్న సందర్భంగా... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇదివరకు వ్యాపారాల్లో రెడ్ టేపిజం (కాలయాపన) ఉండేదన్న ఆయన... ఇప్పుడు టూరిస్టులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం అండ్ కల్చర్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, వరల్డ్ టూరిజం సంస్థ జురాబ్ పోలోలికాష్విలీ సెక్రెటరీ జనరల్ కూడా పాలుపంచుకున్నారు.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>