హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: ఏపీ అసెంబ్లీలో జీవో నెంబర్ 1 రచ్చ.. కొత్త రూల్ క్రాస్ చేసిన 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

AP Assembly: ఏపీ అసెంబ్లీలో జీవో నెంబర్ 1 రచ్చ.. కొత్త రూల్ క్రాస్ చేసిన 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతి రోజూ అదే సీన్ కనిపిస్తోంది. ఏదో ఒక అంశంపై ఆసెంబ్లీలో గందరగోళం కనిపిస్తోంది. అయితే మొన్న అసెంబ్లీలో కొట్లాట కారణంగా స్పీకర్ కొత్త రూల్ జారీ చేసింది. ఆ రూల్ ప్రకారం ఇవాళ 10 మందిని సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమావేశాల్లో మళ్లీ సేమ్ సీన్ కనిపించింది. సభ ప్రారంభం కావడం కాసేపటికే టీడీపీ నేతలు ఆందోళన (TDP Leaders Protest) కు దిగడం.. వారిని స్పీకర్ సస్పెండ్ చేయం రోటీన్ అయ్యింది. తాజాగా ఇవాళ కూడా అదే జరిగింది. అసెంబ్లీ నుండి ఒక్క రోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni seetaram) సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన దగ్గర నుంచి టీడీపీ నినాదాలతో మారుమోగింది. అయితే ఈ సారి స్పీకర్ మాత్రం.. కొత్త రూల్ ప్రకారం సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో గత అనుభవాల నేపథ్యంలోనే ఈ కొత్త రూల్ ప్రవేశ పెట్టారు స్పీకర్.. స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను టీడీపీ ఎమ్మెల్యేలు క్రాస్ చేయడంతో.. ఎలాంటి వివరణ లేకుండానే ఒక్కరోజు వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో స్పీకర్ కొత్త రూలింగ్ పై ప్రతపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజ సమస్యలపై ప్రశ్నిస్తున్నందకే ప్రభుత్వం తమ గొంతు నొక్కేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు అసెంబ్లీలో ఈ రోజు ఏమైంది అంటే..? సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై దాడికి దిగిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. దాంతో పాటు జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరారు. ఈ విషయమై అసెంబ్లీ వెల్ లోకి వెళ్లి టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అసెంబ్లీ వెల్ లో రెడ్ లైన్ దాటడంతో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఈ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు నుంచి ఇదే పరిస్ఠితి కనిపిస్తోంది. టీడీపీ సభ్యులు ప్రతి రోజూ సస్పెన్షన్ కు గురౌతున్నారు. సమావేశాల ప్రారంభం రోజున, నిన్న మినహాయించి ప్రతి రోజూ సభ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురవుతునే ఉన్నారు. తాజాగా జీవో నెంబర్ వన్ ఇష్యూపై ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం కనిపించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్.. మరోవైపు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి : టీడీపీ నెంబర్ 23 బ్యాడ్ సెంటిమెంట్.. అదే ఇప్పుడు వైసీపీకి రివర్స్.. అన్ లక్కీ నెంబర్ ను లక్కీగా మార్చుకున్న చంద్రబాబు

అసలు కొత్త రూల్ ఏంటో తెలుసా..? ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక రూలింగ్ ఇచ్చారు. ఇకపై సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ పోడియం దగ్గరకు రాకూడదని స్పష్టం చేశారు. అలా వస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారుని చెప్పారు. ఈ రూల్‌ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సభ గౌరవాన్ని, హోదాలకు తగ్గించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు స్పీకర్. దీనిలో భాగంగానే ఇవాళ సభ్యులను సస్పెండ్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, AP News, AP Speaker Tammineni Seetharam

ఉత్తమ కథలు