Home /News /andhra-pradesh /

AP Speaker: నేనే ప్రత్యక్ష సాక్షిని.. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందంటే..? క్లారిటీ ఇచ్చిన స్పీకర్

AP Speaker: నేనే ప్రత్యక్ష సాక్షిని.. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందంటే..? క్లారిటీ ఇచ్చిన స్పీకర్

భువనేశ్వరిపై వివాదంలో స్పీకర్ చర్యలు

భువనేశ్వరిపై వివాదంలో స్పీకర్ చర్యలు

AP Speaker: నారా భువనేశ్వరిని అసెంబ్లీ వేధికగా కించపరిచారని టీడీపీ నేతలు పదే పదే విమర్శిస్తున్నారు. ఇటు వైసీపీ నేతలు మాత్రం అసలు అలాంటి ఏదీ జగరలేదని అంటున్నారు. మరి ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన స్పీకర్ ఏమంటు్న్నారు.. ఎవరి వాదన నిజం..?

ఇంకా చదవండి ...
  What happens in Assembly:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ప్రస్తుతం నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ఇష్యూ చుట్టే తిరుగుతున్నాయి. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదని.. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విలువలతోనే తాము పెరిగామని.. నారా భువనేశ్వరి లేఖ  లో  తన మనసులో మాటలు చెప్పారు.. అయినా  ఆ వివాదానికి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు.. ప్రతి రోజు దాని చుట్టే రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు (TDP Leaders) ఇప్పటికే అదే స్టాండ్ పై ఉన్నారు.  ఆ రోజు సభలో రాజకీయాలతో  సంబంధం లేని తన భార్యపై  అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతాను అంటూ శపథం చేశారు..

  ఆ తరువాత మీడియా సమావేశంలో అయితే.. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు రావడంతో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ రోజు నుంచి ఆత్మ గౌరవం పేరుతో టీడీపీ దీక్షలు చేస్తోంది.. వాటిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ రోజు సభలో ఏం జరిగింది అన్నదానిపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. తప్పా సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఆదివారం మంత్రి బొత్స సత్యనారాయణ (minster botsa satya narayana) మాట్లాడుతూ.. అసెంబ్లీ జరిగిన ఘటనను సమర్థించడం లేదని.. అయితే గతంలో ఎమ్మెల్యే రోజా (MLA Roja)ను ఏడిపించినప్పుడు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు..

  మంత్రి బొత్స మాటలు బట్టి  సభలో ఏదో జరిగిందనే భావన కలగడం కామన్. అయితే ఆ ఇష్యూపై తొలిసారి  అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. రాజకీయాలను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ తమ్మనేని సీతారాం  (TammineniSitaram) క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగిన దానికి తాను ప్రత్యక్ష సాక్షినని అన్నారు ఆయన. ఆ రోజు ఏం జరిగిందో తనకు మొత్తం తెలుసునని ఆయన వెల్లడించారు.

  ఇదీ చదవండి : సీఎం అవ్వాలన్న ఆశ.. ఆకాంక్ష రెండూ ఉన్నాయి.. టీడీపీతోనే అనుబంధం.. ఆయన మనసులో మాట ఇదే

  ప్రతిపక్షాల ఆరోపణల్లో అసలు నిజం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. సభా సప్రందాయాలు కాపాడాలనే ఉద్దేశంతో..  చంద్రబాబు సభ నుంచి వెళ్లిన తరువాత రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపనలు ఏ మాత్రం వాస్తవం కాదని స్పీకర్ స్పష్టత ఇచ్చారు.

  ఇదీ చదవండి : పీఆర్సీపై మంత్రి క్లారిటీ.. ఉద్యోగ సంఘాలకు నాది భరోసా అంటున్న బొత్స

  అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన అనుభవాన్ని చంద్రబాబు ఉపయోగిస్తున్నారని విమర్శలు చేశారు.  వ్యక్తిగత వ్యవహారాలను సభ ముందు పెట్టడం సరికాదని హితవు పలికారు. సభలో అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నామన్నారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదనడం బాధాకరమన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, AP Speaker Tammineni Seetharam, Botsa satyanarayana, Chandrababu naidu, Tammineni sitaram, Tdp, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు