AP Assembly- Governor Speech: అవినీతిరహిత పాలనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం: గవర్నర్ నరసింహన్

Andhra Pradesh Assembly Session Governor ESL Narasimhan Speech | అవినీతిరహిత పాలనతో దేశంలో మిగిలిన రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు.

news18-telugu
Updated: June 14, 2019, 9:47 AM IST
AP Assembly- Governor Speech: అవినీతిరహిత పాలనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం: గవర్నర్ నరసింహన్
ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్
  • Share this:
అవినీతిరహిత పాలన అందించేందుకు ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నట్లు గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్... అవినీతి రహిత పాలనలో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. అందుకే ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టెండర్ల ప్రక్షాళనకు జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తామన్నారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దుతామని చెప్పారు.

పాలనలో పూర్తి సంస్కరణలు తీసుకొస్తామన్నారు గవర్నర్ నరసింహన్. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

నవరత్నాలు అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Published by: Janardhan V
First published: June 14, 2019, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading