కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. రైతులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని ప్రకటించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.12,500లు అందజేయనున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. వ్యవసాయానికి 9 గం.ల నిరంతరాయ విద్యుత్‌ను పగటిపూటే అందిస్తామన్నారు.
రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న అందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని గవర్నర్ నరసింహన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కుల,మత, రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.