Breaking News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) తీవ్ర ఉత్కంఠ పెంచిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక (MLA quota MLC Elections) ముగిసింది. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 175 మంది కూడా ఓట్లు వేశారు. అయితే చివరి వరకు ఒక్క ఓటుపై ఉత్కంఠ కనిపించింది. 12 గంటల లోపే 174 ఓట్లు పోలవ్వగా.. ఒక్క ఓటు పెండింగ్ ఉండడంతో అంతా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ఓటు వేయని అభ్యర్థి విజయనగరం జిల్లా (Vizianagaram District) నెలిమర్లకు నియోజకవర్గ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు (Boddukonda Appalanaidu) అని తేలింది. ఇవాళ ఉదయమే తన కుమారుడి వివాహం ఉండడంతో ఆయన రావడం ఆలస్యం అయ్యింది. అయితే ఈ ఎన్నికలో ప్రతి ఓటు కీలకం కావడంతో అతడి కోసం ప్రత్యేక చాపర్ ను పంపించి ఓటు వేయడానికి రప్పించింది అధిష్టానం.. దీంతో ఆయన వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ ముగిసింది.
ఏపీలో అసెంబ్లీ సీట్ల బలం ప్రకారం ఏడుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తూ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడంతో పోటీ పడిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఎన్నికల ఏకగ్రీవం అవుతుంది అనుకుంటే.. పోటీ తప్పలేదు. ఏదో విప్ పేరుతో తమ ఎమ్మెల్యేలను హెచ్చరించడానికి కాదు.. గెలిచే సత్తా ఉంది అని చెబుతూ టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఈ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారింది.
టీడీపీ వాస్తంగా 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నా.. 25కి పైగా ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం ఏడింటికి ఏడు నెగ్గుతాము అంటోంది. మరి ఈ రెండు పార్టీల వాదనల్లో ఎవరి వాదన నెగ్గుతుంది. టీడీపీ చెబుతున్నట్టు వైసీపీ నుంచి ఎవరైనా క్రాస్ ఓట్లు వేశారు.. ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం టీడీపీకి ఉన్న19 మందితో పాటు.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీకే ఓటు వేశారని ప్రచారం జరుగుతోంది. అంటే టీడీపీ బలం 21కి పెరిగినట్టే..
ఇదీ చదవండి : కొత్త ఏడాది పవన్ జాతకం ఎలా ఉంది..? ఈ సారి అసెంబ్లీలో అడుగుపెడతరా..? సీఎం ఛాన్స్ ఉందా..?
ఇక గెలుపునకు టీడీపీకి కావాల్సింది ఒకే ఓటు.. గతంలో టీడీపీ నుంచి వైసీపీికి వెళ్లిన నలుగురిలో ఒక ఎమ్మెల్యే ఓటు తమకే పడింది అన్నది సైకిల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్టే.. ఏడు సీట్లు నెగ్గాల్సిన వైసీపీ.. బలం ఉన్న ఒక సీటును కోల్పోవలసి వస్తుంది. అయితే కేవలం టీడీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేనే కాకుండా.. అధికార పార్టీలో అసమ్మతి గళం వినిస్తున్న కొందరు నేతలు కూడా తమకు ఓటు వేస్తారని తెలుగు తమ్ముళ్లు చెప్పడం.. అధికార పార్టీలో కలకలం రేపుతుంది.
ఇదీ చదవండి: చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? లోకేష్ భవష్యత్తు ఏంటి..? టీడీపీ పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?
కేవలం టీడీపీ చేస్తున్నది ప్రచారమేనా..? లేక నిజంగా టీడీపీ చెప్పినట్టు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారా అన్నది కాసేపట్లో తేలిపోనుంది. ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే వైసీపీ కి వాస్తవ బలం ప్రకారం 7 గెలిచే అవకాశం ఉంది. అలా కాకుండా టీడీపీ నెగ్గితే సంచలనం నమోదైనట్టే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap mlc elections, AP News, TDP, Ycp