హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Budget 2022: తొలి రోజే హీటెక్కిన అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ వాకౌట్..

AP Budget 2022: తొలి రోజే హీటెక్కిన అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ వాకౌట్..

AP Budget 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హీటెక్కాయి. తొలిరోజే సభలో రచ్చ అయ్యింది.. తొలిసారి గవర్నర్ సభలో నేరుగా ప్రసంగిస్తుంటే.. అదే సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ గో బ్యాక్ నినాదాలతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేశారు. మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లారు.

ఇంకా చదవండి ...

  TDP Members Boycott:  ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్లే ప్రారంభమయ్యాయి. తొలిరోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. నినాదాలతో సభలో హెరేత్తించారు. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. నినాదాలు, ఆందోళనలతో గవర్నర్ ఏమి ప్రసంగిస్తున్నారో అర్థం కాకుండా పోయింది. మార్షల్ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు. దీంతో మార్షల్స్ తో టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ సభ్యులు వెళ్లిపోయారు.

  అంతకుముందు  గవర్నర్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా..ఇలా చేయడం ఏంటీ ? అంటూ ఆయన సైగలు చేశారు. వెల్ లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. టీడీపీ సభ్యులు వ్యహరించిన తీరుపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఈ తీరు సరైనది కాదంటూ పెదవి విరిచారు.

  టీడీపీ ఆందోళన ఎలా ఉన్నా గవర్నర్ తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు 2,304 కోట్లు జమ చేశామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు.

  ఇదీ చదవండి : భగ్గుమంటున్న వంట నూనెల ధరలు.. లీటర్ ధర ఎంతంటే..?

  రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ తెలిపారు. కోవిడ్‌ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, AP Budget 2022, Ap cm jagan, AP News, TDP

  ఉత్తమ కథలు