AP Budget Session 2020 LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం....

AP Budget Session 2020 LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం....

ఉభయసభలకు ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ హరిచందన్

AP Budget Session 2020 LIVE : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాటిని లైవ్‌లో చూడండి.

  • Share this:
    AP Assembly budget session 2020 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఉదయం 11:30 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరగనుంది. తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగానే... గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, దానిపై చర్చ ఉంటుంది. గవర్నర్‌ ప్రసంగంపై ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు. ఆ తర్వాత సాధారణ, వ్యవసాయ బడ్జెట్లు వరుసగా మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెడతారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు. గతేడాది ప్రభుత్వం 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి మరింత పెద్ద బడ్జెట్ ఉండనున్నట్లు తెలిసింది. ఇందులో సంక్షేమ పథకాలు, నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    ఈసారి సమావేశాల్లో కీలక అంశాలు :
    - 11:30కి బీఏసీ సమావేశం.
    - బీఏసీ తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, చర్చ, ఆమోదం.
    - మధ్యాహ్నం 12:30 తర్వాత రెండు సభల్లో బడ్జెట్‌
    - 17న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం... బడ్జెట్‌పై చిన్నగా చర్చ, ఆమోదం.
    - 18న అసెంబ్లీ ఉండదు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్లు ఉంటాయి.
    - 19న రాజ్యసభ ఎన్నికలు... ఫలితాలు
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు