కాపు రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనసభ

కాపు రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనసభ

ఏపీ తాత్కాలిక సచివాలయం (ఫైల్ ఫొటో)

కాపు రిజర్వేషన్‌ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో  ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

  • Share this:
    కాపు రిజర్వేషన్‌ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో  ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన విషయం తెలిసిందే... ఆ పదిశాతంలో కాపులకు ఐదు శాతాన్ని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా  ప్రవేశ పెట్టిన బిల్లు శాసన సభలో ఆమోదంపొందింది.   కాపు, ఒంటరి, బలిజ కులాలకు ఈ రిజర్వేషన్‌ వర్తించనుంది. అయితే ఇవి రాజకీయ రిజర్వేషన్లు కావు..  ఈ రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన ఐదుశాతాన్ని అగ్రవర్ణాలలో పేదలకు కల్పిస్తూ చట్టం చేశారు.
    First published:

    అగ్ర కథనాలు