Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. శ్రీశైలం నుంచి తిరిగి వెళ్తుండగా ఘటన..

Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. శ్రీశైలం నుంచి తిరిగి వెళ్తుండగా ఘటన..

ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతిచెందారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్సి పొందుతున్నారు. మృతుల్లో ఏడుగురు ప్రమాదం జరిగిన చోటే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, మహిళలు ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.

    ఈ ప్రమాదంలో మరణించినవారిని తమిళనాడుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమంలో టెంపోలో మొత్తం 15 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు