Kodali Nani : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీ కొన్నాళ్లుగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా హైదరాబాద్.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం కోలుకుంటున్న నానీ.. రెండ్రోజుల్లో డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే నానీ... కొంత గ్యాప్ ఇచ్చి.. రెండు వారాలపాటూ.. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలిసింది. మళ్లీ 15 రోజుల తర్వాత కొడాలి నానీకి కిడ్నీలకు సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ చేస్తారని సమాచారం. మొత్తంగా ఆయన ఐసీయూలో ఉండటంతో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani