నేడు మరో పథకం ప్రారంభిస్తున్న ఏపీ సీఎం జగన్... ఒక్కో కుటుంబానికి కనీసం రూ.2 లక్షలు

ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ప్రభుత్వం... మేనిఫెస్టోలో చెప్పిన పథకాలతోపాటూ... కొన్ని అదనపు పథకాలు కూడా అందిస్తోంది. తాజాగా మరో మంచి పథకాన్ని ఇవాళ ప్రారంభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 21, 2020, 11:29 AM IST
నేడు మరో పథకం ప్రారంభిస్తున్న ఏపీ సీఎం జగన్... ఒక్కో కుటుంబానికి కనీసం రూ.2 లక్షలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
YSR Bhima Scheme: ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం వర్తించేలా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలు అమలు చేసింది. ఇందుకోసం అప్పుు చేసి మరీ పథకాలకు డబ్బు కేటాయిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలతోపాటూ.. మరిన్ని అదనపు స్కీములను కూడా అమలు చేసింది ప్రబుత్వం. ముఖ్యంగా పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, గర్భిణులు, విద్యార్థులు, ముసలి వారు ఇలా... అన్ని వయసుల వారికీ వర్తించేలా ప్రభుత్వ పథకాలున్నాయి. తాజాగా మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది ప్రభుత్వం. రేషన్ కార్డు ఉండి... కుటుంబలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం. పథకం అమల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలూ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

వైఎస్ఆర్ బీమా పథకం ఎలా వర్తిస్తుంది?:

-18 నుంచి 50 ఏళ్ల లోపు వయసుగలవారు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు.. ప్రమాదవశాత్తూ మరణించినా, ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం బారిన పడినా... రూ.5 లక్షల బీమా పరిహారాన్ని వారి నామినీకి ఇస్తారు.
- 51 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.3 లక్షల బీమా పరిహారాన్ని నామినీకి ఇస్తారు.
- 18 నుంటి 70 ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవశాత్తూ పాక్షిక, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.1.50 లక్షలు ఇస్తారు.
- నామినీలుగా భార్య, 21 ఏళ్లు నిండిన కొడుకు, పెళ్లి కాని కూతురు, వితంతువు అయిన కూతురు... ఒకవేళ లబ్ధిదారుడుతో ఉంటే... వారి మీద ఆధార పడిన తల్లిదండ్రులు.. వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది.
- ఈ పథకం లబ్ధిదారులకు ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు. ఈ పథకం ఎంపిక వాలంటీర్ల డోర్ టూ డోర్ సర్వే ద్వారా ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియపై వాలంటీర్లకు పూర్తిగా అవగాహన కల్పించారు.

ఓ భీమా పథకానికి ప్రభుత్వం ఒకేసారి ఇంత భారీగా మనీ కేటాయించడం ఇదే తొలిసారి. ఐతే... లబ్దిదారుల సంఖ్య పెరిగితే... మరింత మందికి లబ్ది కలిగించేలా మరింత నిధులు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. పథకం ప్రయోజనం పొందేందుకు.. లబ్దిదారులందరూ... బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే మంచిది. తద్వారా వెంటనే బీమా పరిహారం చెల్లించేందుకు వీలవుతుంది. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఆ సమయంలో... పేదలు చెప్పిన కష్టాలు విని... ఇలాంటి పథకం తేవాలని నిర్ణయించుకున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 21, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading