AP Police Seva App: ఏపీ పోలీస్ సేవ యాప్... ఇవీ ప్రత్యేకతలు, పూర్తి వివరాలు

AP Police Seva App: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... పోలీస్ శాఖలో ఎన్నో మార్పులు చేస్తోంది. వాటిలో భాగంగా... తాజాగా ఏపీ పోలీస్ యాప్ రూపొందింది.

news18-telugu
Updated: September 21, 2020, 4:10 PM IST
AP Police Seva App: ఏపీ పోలీస్ సేవ యాప్... ఇవీ ప్రత్యేకతలు, పూర్తి వివరాలు
వైఎస్ జగన్ (File)
  • Share this:
పోలీసులతో పని ఉండే ఏ సమస్య వచ్చినా... మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్లే పనిలేకుండా పనైపోతే... భలే ఉంటుంది కదూ... దీన్ని సాకారం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ... సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలు 87 రకాల సేవల్ని యాప్ ద్వారా పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల సేవల్నీ ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందొచ్చు. అన్ని నేరాలపై యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ప్రతి కంప్లైంట్‌కీ రశీదు కూడా ఇస్తారు. అందువల్ల పోలీసు శాఖలో ఈ యాప్ ఓ సంచలనం అనుకోవచ్చు.

ఏపీ పోలీస్‌ సేవ యాప్‌‌ ద్వారా లభించే సేవలు:
- దర్యాప్తు వివరాలు, అరెస్టులు, FIRలు, రికవరీలు, రోడ్డు భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు పర్మిషన్లు, NOCలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవల్నీ యాప్‌ ద్వారా పొందొచ్చు.

ఏపీ పోలీస్‌ సేవ యాప్‌‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌‌లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఎమర్జెన్సీ టైంలో వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం ఈ యాప్‌లో ఉంది.

ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌ ఉన్నాయి. అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావన యువతులు, మహిళల్లో కలిగేలా ఈ యాప్ సేవలను అందిస్తుంది.

రాష్ట్రంలోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో వచ్చిన దిశ మొబైల్ అప్లికేషన్ (SOS)ను 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568 మంది నుంచి కంప్లైంట్ ఇవ్వగా... 117 FIRలను నమోదు చేశారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా... సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100, ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 1,850 పిటిషన్లు అందగా 309 FIRలు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.


6 విభాగాల్లో ఏపీ పోలీస్‌ సేవ యాప్‌‌లో 87 రకాల సేవలు

శాంతి భద్రతలు:
- నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు
- ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌
- దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు
- తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు
- అరెస్టుల వివరాలు
- వాహనాల వివరాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు :
- ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌)
- ఇ–చలానా స్టేటస్‌

పబ్లిక్‌ సేవలు:
- నేరాలపై ఫిర్యాదులు
- సేవలకు సంబంధించిన దరఖాస్తులు
- ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు
- లైసెన్సులు, అనుమతులు
- పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌

రహదారి భద్రత:
- బ్లాక్‌ స్పాట్లు
- యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌
- రహదారి భద్రత గుర్తులు
- బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు

ప్రజా సమాచారం:
- పోలీస్‌ డిక్షనరీ
- సమీపంలోని పోలీస్‌స్టేషన్‌
- టోల్‌ఫ్రీ నంబర్లు
- వెబ్‌సైట్ల వివరాలు
- న్యాయ సమాచారం
- ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు

ప్రజా సమాచారం:
- పోలీస్‌ డిక్షనరీ
- సమీపంలోని పోలీస్‌స్టేషన్‌
- టోల్‌ఫ్రీ నంబర్లు
- ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు
- వెబ్‌సైట్ల వివరాలు
- న్యాయ సమాచారం
Published by: Krishna Kumar N
First published: September 21, 2020, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading