హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో నకిలీ వార్తలకు చెక్... కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన జగన్

Andhra Pradesh: ఏపీలో నకిలీ వార్తలకు చెక్... కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై (Andhra Pradesh Government) ఇప్పుడు నకిలీ వార్తలపై దృష్టి పెట్టింది. ఇకపై అసత్య ప్రచారాలు, నకిలీ వార్తలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పుడు నకిలీ వార్తలపై దృష్టి పెట్టింది. ఇకపై అసత్య ప్రచారాలు, నకిలీ వార్తలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ పట్టుకొస్తున్యని భావించిన ప్రభుత్వం వాటికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలన్నింటిపై ప్రభుత్వానికి, అదికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వార్తలు వైరల్ అయినట్లు గుర్తించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని.. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంటూ ప్రచారం జరిగిపోయింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాయి. వారికి సంబంధించిన సోషల్ మీడియా విభాగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేశాయి.

ఇటీవల గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద సీతమ్మ పాదాలు కొండపై చర్చి నిర్మిస్తున్నారన్న ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు వైరల్ చేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే స్కూళ్లకు సెలవుల వంటి అంశం కూడా చాలా వైరల్ అయింది. మార్చి 1 నుంచి మే 4 వరకు స్కూళ్లకు సెలవులిస్తున్నారంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఈ విషయంలో సెలవులు నిజమేనన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ప్రచారాన్ని ఖండించాల్సి వచ్చింది.

ఇది చదవండి: ఆ పథకం విషయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని మరిచారా...?



అలాగే సంక్షేమ పథకాల అమలుతో పాటు పలు కీలక అభివృద్ధి పనుల విషయంలో గందరగోళం సృష్టించే విధంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా పోలవరం ఎత్తు తగ్గింపు, రేషన్ డోర్ డెలివరీ వంటి అంశాలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్ఈసీ వాట్సాప్ నంబర్ అంటూ ఓ ఫేక్ నెంబర్ సోషల్ మీడియాను చుట్టేసింది.

వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో దీన్ని అధిగమించడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా కొత్త వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. https://factcheck.ap.gov.in పేరుతో రూపొందించిన ఈ వెబ్ పోర్టల్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాతో పాటు ఎక్కడ ఎలాంటి నకిలీ వార్తలు వచ్చినా ఈ వెబ్ సైట్ ట్యాగ్ చేసేలా రూపొందించారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లోనూ దీనిపై స్పెషల్ పేజీలు క్రియేట్ చేశారు. ఎవరైనా పోస్ట్ చేసిన వార్త నకిలీ వార్త అని తేలిదే.. సదలు వ్యక్తులు దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో వివరణ సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Fact Check, Fake news