• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PADESH CM YS JAGANMOHAN REDDY TO CREDIT YSR RYTHU BHAROSA SCHEME MONEY INTO FARMERS ACCOUNTS ON THURSDAY FULL DETAILS HERE PRN

YSR Raithu Bharosa: రైతులకు గుడ్ న్యూస్... ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేయనున్న సీఎం జగన్..

YSR Raithu Bharosa: రైతులకు గుడ్ న్యూస్... ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేయనున్న సీఎం జగన్..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రకటించిన క్యాలెండర్ (welfare Scheme Calendar) ప్రకారం.. రైతుల కోసం మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించందుకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంబించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,882.23 కోట్లు రైతు భరోసా సాయం అందించనున్నారు. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. ఇది మూడు విడతలుగా ఇవ్వనున్న ప్రభుత్వం. మొదటి విడతలో ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతలో ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ, జనవరి నెలలో రూ. 2,000 జమ చేయనుంది.

    కరోనా నేపధ్యంలో ఖరీఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కింద మొదటి విడత సాయంగా నేడు అందిస్తున్న రూ. 3,882.23 కోట్లతో పాటు మే నెలలోనే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద మరో రూ. 2,000 కోట్లలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద 2019 – 20 నుంచి ఇప్పటివరకు రైతులకు రూ. 13,101 కోట్ల సాయం, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి మొత్తం రైతు భరోసా సాయం రూ. 16,983.23 కోట్లకు చేరనుంది.

    ఇది చదవండి: విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.., ఏపీలోనే విదేశీ విద్య..


    దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఏటా రూ. 13,500 సాయం ఆందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఏటా ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50,000 ఇస్తామన్న ప్రభుత్వం ఏటా రూ. 13,500 చొప్పున ఐదేళ్లపాటు రూ.67,500 అందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల కింద రైతులకు ఇప్పటివరకు రూ. 67,953.76 కోట్లు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ పథకం కింద అర్హులను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద నిధులు కూడా రైతుల ఖాతాల్లో చేరనున్నాయి.

    ఇది చదవండి: బాలకృష్ణ బాటలో ఎమ్మెల్యే రోజా... కరోనా కట్టడికి భారీ సాయం

    Published by:Purna Chandra
    First published: