హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ To బంగ్లాదేశ్...రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు..ఎందుకంటే?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ To బంగ్లాదేశ్...రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు..ఎందుకంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు మిర్చి (Guntur Red Chilis) అంటే ఫేమస్. ఘాటుగా ఉండే మిర్చికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది.

ఇండియన్ రైల్వే. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఒక్క ప్రయాణికులనే కాదు ప్రజలకు అవసరమైన సరకులు, వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, ఎరువులు ఇలా ప్రతి వస్తువుని ఆయా రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా రవాణా చేస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు మిర్చిని కూడా విదేశాలకు తరలిస్తోంది రైల్వే. దేశవ్యాప్తంగా మన గుంటూరు మిర్చి అంటే ఫేమస్. ఘాటుగా ఉండే మిర్చికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో రైతులు మిర్చిని పండిస్తున్నా గుంటూరు మిర్చికి ఉండే స్పెషాలిటీనే వేరు. దీంతో ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంటుంది. గుంటూరు మిర్చి యార్డు నుంచి చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంటుంది.

ఏటా వేల క్వింటాళ్ల మిర్చిని గుంటూరు రైతులు ఎగుమతి చేస్తున్నారు. ఇందుకోసం రైల్వేశాఖ పొరుగు దేశాలకు ప్రత్యేక పార్శిల్ ట్రైన్లను నడుపుతోంది. గత ఏడాది తొలిసారిగా గుంటూరు శివారులోని రెడ్డిపాలెం స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ కు కార్గో ట్రైన్ ను నడిపింది. ఈ ట్రైన్ ఒక్క ట్రిప్ లో 384 టన్నుల మిర్చిని రవాణా చేస్తోంది. 16 బోగిలున్న ఈ ట్రైన్..,మొత్తం 1374 కిలోమీటర్లు ప్రయాణించి మిర్చిని బంగ్లాదేశ్ చేరవేస్తోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడంతో నిలిపేసింది. దీంతో మిర్చి రవాణాకు బ్రేక్ పడింది. గత ఆరు నెలలుగా లాక్ డౌన్ సడలింపులు మొదలవడం, కరోనాకు వ్యాక్సిన్ కూడా రావడంతో మరోసారి బంగ్లాదేశ్ కు మిర్చి రవాణాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించనుంది. దీంతో మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి తగ్గడంతో నిల్వలు పేరుకుపోతున్నాయని.., ఇప్పుడు మళ్లీ మొదలుకాబోతుండటంతో మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కలిగిందంటున్నారు. అంతేకాదు నిల్వలు పేరుకుపోవడంతో ఆ ప్రభావం ధరలపైనా పడుతోందని చెప్తున్నారు.

రైతుల కోసం ప్రత్యేక రైళ్లు

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు తొలి ప్రాధాన్యమిస్తున దక్షిణమధ్య రైల్వే గత ఏడాది అనంతపురం జిల్లాలోని ఉద్యాన రైతులు తమ ఉత్పత్తులను తరలించేందుకు కిసాన్ రైనులును అనంతపురం నుంచి న్యూ ఢిల్లీకి నడిపింది రైల్వే శాఖ. ఈ రైలు ద్వారా వేలాది మంది రైతులకు మార్కెటింగ్ సౌకర్యం లభించింది. అలాగే దూద్ దురంతో ఎక్స్ ప్రెస్ ద్వారా చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి 5కోట్ల లీటర్ల పాలను న్యూ ఢిల్లీకి రవాణ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణలోని సనత్ నగర్ నుంచి నిత్యావసర సరుకులు, నిజామాబాద్ నుంచి బంగ్లాదేశ్ కు పసుపు రైళ్ల ద్వారానే రవాణా అవుతున్నాయి. 2020లో దక్షిణ మధ్య రైల్వే 94.34 మిలియన్ టన్నుల సరుకులు, 2.1 లక్షల టన్నుల పార్శిళ్లను చేరవేసింది.

First published:

Tags: Andhra Pradesh, Guntur, India Railways, South Central Railways

ఉత్తమ కథలు