హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: బస్సులోనే మహిళ మృతి... ఆర్టీసీ సిబ్బంది చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే...!

Andhra Pradesh: బస్సులోనే మహిళ మృతి... ఆర్టీసీ సిబ్బంది చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే...!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చనిపోతే జనం అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. కొందరైతే పోలీసులకో, 108కో ఫోన్ చేసి చేతులు దులుపుకుంటారు. కానీ విజయవాడ ఆర్టీసీ అధికారులు మాత్రం అలా చేయలేదు.

  బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చనిపోతే జనం అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. కొందరైతే పోలీసులకో, 108కో ఫోన్ చేసి చేతులు దులుపుకుంటారు. కానీ విజయవాడ ఆర్టీసీ అధికారులు మాత్రం అలా చేయలేదు. బస్సులో ప్రాణాలు వదిలిన మహిళ మృతదేహాన్ని స్పెషల్ బస్సులో ఇంటికి చేర్చారు. ఇటీవల విజయనగరం జిల్లాలో ఓ బస్సులో వ్యక్తి మృతి చెందగా.. రోడ్డుపైనే వదిలేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం బస్సు డ్రైవర్ అలా చేయలేదు. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ.. నర్సాపురం డిపోకు చెందిన బస్సులో హైదరాబాద్ కూకట్ పల్లి నుంచి పాలకొల్లు బయలుదేరారు. బస్సు విజయవాడ చేరుకునేలోపు ఆమె అచేతనంగా పడి ఉన్నారు.

  వెంటనే గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ 108కి సమాచారం అందించారు. వారు పరీక్షించిన అనంతరం ఆదిలక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలుపగా.. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు వేరే బస్సు కేటాయించారు. ఆది లక్ష్మి మృతదేహాన్ని అదే బస్సులో స్వగ్రామానికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులో మృతదేహాన్ని తరలించడం ఇదే మొదటిసారి అని విజయవాడ బస్ స్టేషన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాధాకృష్ణ మూర్తి తెలిపారు. ఆర్టీసీ అధికారులు చూపిన చొరవకు ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

  ఇటీవల విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాలూరుకి చెందిన వృద్ధుడు దాసరి పైడయ్య అతడి భార్య పార్వతీపురం నుంచి బస్సులో సాలూరుకు వెళ్తున్నారు. అయితే మార్గం మధ్యలో బస్సులో ఉండగానే వృద్ధుడు మృతి చెందాడు. భర్త అపాస్మారక స్థితిలో పడిపోవడం చూసి ఆ వృద్ధమహిళ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ వృద్ధుడు చనిపోయాడని బస్సులో వారు నిర్ధారించారు. వెంటనే కనికరం చూపించకుండా బస్సులోంచి కిందకు దిగిపోవాలని కండక్టర్, డ్రైవర్ దిగిపోమని చెప్పారు.

  తనకు ఎక్కడికి వెళ్లాలో తెలీదని సాలూరులో దించేయాలని ఆ వృద్ధురాలు వేడుకున్నా వినలేదు. బస్సులోంచి దించేయాలి అనుకున్పప్పుడు కనీసం వేరే వాహనం మాట్లాడడం లేదంటే కనీసం 108 ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆమె వృద్ధురాలు అనే జాలి కూడా చూపించలేదు.. డ్రైవర్, కండెక్టర్ సంగతి పక్కన పెడితే.. ఆ బస్సులో ఉన్నవారు సైతం ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.. అంతా కలిసి ఆ మృతదేహాంతో సహా వృద్ధురాలను కిందకు దింపేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు వృద్ధురాలికి క్షమాపణ చెప్పారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Vijayawada

  ఉత్తమ కథలు