హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

University Exams: గులాబ్ ఎఫెక్ట్‌.. ఆంధ్రా యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌లు వాయిదా

University Exams: గులాబ్ ఎఫెక్ట్‌.. ఆంధ్రా యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌లు వాయిదా

ఆంధ్రా యూనివ‌ర్సిటీ

ఆంధ్రా యూనివ‌ర్సిటీ

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ కార‌ణంగా చాలా చోట్ల విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రా యూనివ‌ర్సిటీ (Andhra University) ప‌రిధిలో ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...

  తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ ( (Gulab cyclone) కార‌ణంగా చాలా చోట్ల విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రా యూనివ‌ర్సిటీ (Andhra University) ప‌రిధిలో ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి స‌మ‌చారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.andhrauniversity.edu.in/ ను సంద‌ర్శించాల‌ని అధికారులు సూచించారు. గులాబ్ తుఫాన్ నేప‌థ్యంలో పరీక్ష నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబ‌ర్ 27, 2021 నుంచి జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం ఉన్న తుఫాను కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్లు అధికారుల తెలిపారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా యూనివ‌ర్సీటి అనుబంధ క‌ళాశాల‌ల్లోనూ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌నున్నాయి. విద్యార్థులు ఈ విష‌యం గ్ర‌హించి స‌హ‌క‌రించాల‌ని యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు.


  Trains cancelled: "గులాబ్" ప్ర‌భావం పలు రైళ్లు రద్దు.. దారి మ‌ళ్లింపు వివ‌రాలు ఇవే


  త‌దుప‌రి ప‌రీక్ష‌లు షెడ్యూల్‌ని కూడా అధికారులు స‌ర్క్యూల‌ర్‌లో పొందు ప‌రిచారు.

  (స‌ర్క్యూల‌ర్ కోసం క్లిక్ చేయండి)

  - బీటెక్ బీఆర్క్‌, బీటెక్‌+ఎంటెక్‌, ఎమ్మెస్సీ, అప్లెయిడ్ కెమిస్ట్రీ, ఐదేళ్ల కోర్సు ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 6, 2021 పోస్టుపోన్ చేశారు.

  - బీఫార్మ‌సీ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 8, 2021కి పోస్టుపోన్ చేశారు.

  - ఎమ్మెస్సీ అప్లెయిడ్ కెమిస్ట్రీ (రెండేళ్ల కోర్సు) అక్టోబ‌ర్ 1, 2021కి వాయిదా వేశారు.

  - ఎంసీఏ, ఎమ్మెస్సీ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 4, 2021కి వాయిదా వేశారు.

  - ఎం.ఈడీ సెకండ్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 1, 2021కి వాయిదా వేశారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra university, EDUCATION, Exams postponed, Study, University exams

  ఉత్తమ కథలు