ANCHOR PRADEEP MACHIRAJU APOLOGIZED AP PARIRAKSHANA SAMITHI FOR MAKING COMMENTS ON ANDHRA PRADESH CAPITAL ISSUE IN A TELEVISION PROGRAM HERE ARE THE DETAILS PRN
Anchor Pradeep Machiraju: బాధపెట్టి ఉంటే క్షమించండి... వారికి సారీ చెప్పిన యాంకర్ ప్రదీప్
Anchor pradeep Photo : Twitter
ఓ టీవీ షోలో ప్రసారమయ్యే షోలో చేసిన కామెంట్స్ కు యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Anchor Pradeep) వివరణ ఇచ్చుకున్నాడు.
ఇటీవల సెలబ్రెటీలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమాలు, టీవీ షోల్లో చేసే కామెంట్స్ వల్ల కొన్నివర్గాల మనోభావాలు దెబ్బతినడంతో వివాదాలు చుట్టుముడుతున్నాయి. రీసెంట్ గా ఇద్దరు సెలబ్రెటీలు ఇలాంటి వివాదాల్లోనే చిక్కున్నారు. జబర్దస్త్ కమెడియన్ హైదర్ ఆదితో పాటు యాంకర్ ప్రదీప్ కూడా కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇటీవల తాను చేసిన కామెంట్స్ కు యాంకర్ ప్రదీప్ అమరావతి రైతులు, ఏపీ పరిరక్షణ సమితికి క్షమాపణలు చెప్పాడు. ఓ షోలో తాను రాజధాని గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఓ షోలో మాట్లాడుతూ తాను విశాఖ క్యాపిటల్ ఎంటని మాత్రమే అడిగానని.. అవతలి వ్యక్తి దీనికి వేరే సమాధం ఇవ్వడంతో దీనిని కొందరు తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల పెద్ద వివాదంగా మారిందని వివరణ ఇచ్చాడు.
తన లక్ష్యం ప్రజలకు వినోదం అందించడమేనని.. ఎవర్నీ కించపరచం కాదన్నాడు. ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని.. ప్రస్తుతం జరుగుతున్న వివాదలపై మాట్లాడలనే ఉద్దేశమే లేదని ప్రదీప్ స్పష్టం చేశాడు. ఓ షోలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పై ప్రదీప్ మాట్లాడాడు. దీనిపై స్పందించిన ఏపీ పరరక్షణ సమితి ప్రదీప్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని అంతేకాకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పకుంటే తన ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస రావు తెలిపాడు. ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న ఈ విషయం గురించి యాంకర్ ప్రదీప్ ఏ విధంగా అలా మాట్లాడడని మండిపడ్డారు. రైతుల, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే మరోలా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపాడు. ఈ విమర్శలపై స్పందించిన ప్రదీప్.. క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు.
అంతేకాకుండా ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఇటువంటి వివాదంలో చిక్కుకున్నాడు. ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో తెలంగాణ భాష గురించి, బతుకమ్మ గురించి కించపరిచే విధంగా మాట్లాడటంతో హైపర్ ఆది మాటలను కూడా ఖండించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ రంగారెడ్డి అధ్యక్షులు నవీన్ గౌడ్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదిని క్షమాపణలు చెప్పమని తెలిపారు. దీంతో హైపర్ ఆది క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.