Home /News /andhra-pradesh /

ANANTHAPURAM DISTRICT COLLECTOR GANDHAM CHANDRUDU PROVIDE BUS SERVICE TO SCHOOL STUDENTS WITHIN TWO DAYS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం.., ఈ కలెక్టర్ చాలా స్పెషల్..,

విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న 
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

Andhr Pradesh: ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని గంధం చంద్రుడు (Gandham Chandrudu) తెలిపారు.

    ప్రజాసమస్యలు ఎక్కడుంటే ప్రభుత్వం అక్కడుండాలి. వారి సమస్య పరిష్కారం కాకుంటే ఎన్ని ప్రభుత్వాలున్నా.., ఎంతమంది అధికారులున్నా ఆ పాలనకు అర్ధముండదు. భావి భారత పౌరులుగా ఉండే విద్యార్థులకు వచ్చే ఎదురయ్యే సమస్యలు ఇట్టే పరిష్కారం కావాలి. లేదంటే ఆ సమస్య వారి భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపుతుంది. బడికి వెళ్లాలంటే నిత్యం నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థుల కష్టాలు తెలుసుకున్నకలెక్టర్..,రెండు రోజుల్లోనే వారి సమస్యను పరిష్కరించి శభాష్ అనిపించుకున్నారు. ఆయనే అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు లేదు. స్థానికులు సొంత వాహనాలు, ఆటోలను నమ్ముకొని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థుల సమస్య వర్ణనాతీతం. బడికి వెల్లాలంటే 10 కిలోమీటర్లు నడిచి వెల్లాల్సిన పరిస్థితి.

    రెండు రోజుల్లో సమస్య పరిష్కారం
    ఎన్నో సార్లు నేతలకు, అధికారులకు సమస్య విన్నవించుకున్నా వారి సమస్య తీరలేదు. ఐతే ఈనెల 20న విద్యార్థులు తమకు బస్సు సౌకర్యం లేదని తమకు సర్వీస్ వేయించాలని సోషల్ మీడియా ద్వారా కలెక్టర్ గంధం చంద్రుడికి విజ్ఞప్తి చేసారు. వారి సమస్య తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయించారు. ఆయనే స్వయంగా విద్యార్థులతో కలిసి బస్సును ప్రారంభించారు. అంతేకకుండా విద్యార్థులతో కలిసి గొంచిరెడ్డిపల్లి నుంచి బ్రహ్మసముద్రం వరకు బస్సులో ప్రయాణించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

    Ananthapuram District Collector Gandham Chandrudu provide bus service to School Students within two days in Andhra Pradesh
    బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్ గంధం చంద్రుడు


    విద్యకు అధిక ప్రాధాన్యం: గంధం చంద్రుడు
    ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని గంధం చంద్రుడు తెలిపారు. విద్యార్థులకు ఎక్కడ ఏ సమస్యలున్నా వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులతో కలిసి ప్రయాణించడం ద్వారా వారితో మమేకమై సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుందని చంద్రుడు చెప్పారు. విద్యార్థుల అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. తమ సమస్య తెలుసుకున్న వెంటనే పరిష్కరించిన కలెక్టర్ గంధం చంద్రుడుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

    Ananthapuram District Collector Gandham Chandrudu provide bus service to School Students within two days in Andhra Pradesh
    విద్యార్థులతో మాట్లాడుతున్న గంధం చంద్రుడు


    చంద్రుడు చాలా స్పెషల్
    గతంలోనూ గంధం చంద్రుడు విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా హరిజన, గిరజన, దళితవాడలుగా పిలవబడుతున్న 480 కాలనీల పేర్లను మార్చడంలో గంధం చంద్రుడు కీలకపాత్ర పోషించారు. ఆయా కాలనీలకు విశ్వరత్న నగర్, జగ్జీవన్ రామ్ నగర్, ఇందిరా నగర్ పేర్లు పెట్టారు. మరికొన్ని కాలనీలకు అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద సేవలు అందిస్తున్న RDT ఫౌండేషన్ స్థాపకుడు డేవిడ్ ఫెర్రర్ పేరు పెట్టారు. అలాగే RDT నగర్ గానూ నామకరణం చేశారు.

    Gandham Chandrudu, Ananthapuram, Andhra Pradesh, APSRTC, Collector Gandham Chandrudu, Bus Service, Students, Students Problems, Education, గంధం చంద్రుడు, అనంతపురం జిల్లా, ఆంద్రప్రదేశ్, ఏపీఎస్ఆర్టీసీ, కలెక్టర్ గంధం చంద్రుడు, బస్ సర్వీసు, విద్యార్థులు, విద్యార్థుల సమస్యలు, విద్య,Andhra Pradesh news, AP news, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, Andhra Pradesh Government, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
    బస్సులో విద్యార్థినులతో మాట్లాడుతున్న గంధం చంద్రుడు


    అలాగే బాలికల దినోత్సవం నాడు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లోని బాధ్యతలను  బాలికలకు అప్పగించారు గంధం చంద్రుడు . కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినికి ఒక రోజు కలెక్టర్ గా అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్రంలోనే వేగవంతంగా కొవిడ్ ఆస్పత్రి నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. సాధారణ కుటుంబం నుంచి IAS స్థాయికి ఎదిగిన గంధం చంద్రుడు.., అప్పుడప్పుడు కూలీలతో కలిసి ఉపాధి హామీ పనుల్లోనూ పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Andhra pradesh news, AP Schools, Apsrtc, IAS, School bus, Students\

    తదుపరి వార్తలు