G Venkatesh, News18, Anantapuram
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా (Anantapuram) లో అయితే పొలిటికల్ ఫైట్ పీక్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో నేతల మాటలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాప్తాడు మండలంలోని రామనేపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓ వర్గం మీడియా కావాలనే తనపై దుష్ప్రచారంచేస్తున్నారని, కావాలనే తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబును మళ్లీ పీఠం ఎక్కించాలనే ఉద్దేశంతో కొందరు యత్నిస్తు్నారన్నారు.
చంద్రబాబుకి, ఆయన కుమారుడు లోకేష్ కు లేని ప్రతిష్టను ఆపాదించి పొలిటికల్ మైలేజ్ పెంచేందుకు యత్నిస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గత నాలుగేళ్లలో తనపై కావాలానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ అనుకూల మీడియా ప్రచురించన కథనాల్లో ఓ చిన్న తప్పు చేసినట్లు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తోపుదుర్తి సవాల్ చేశారు.
విచారణ జరపాలని హైకోర్టును కూడా కోరుతున్నామని.. సీబీఐకి విచారణ జరపాలని లేఖలు రాయాలన్నారు. లేకుంటే తనను రాయమన్నా రాస్తానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారు నిరూపించకపోతే అనంతపురం వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి మంచి జరుగుతుందని ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు తమ వైపే ఉండాలని తెలిపారు. అర్హత ఉండి ఎవరికైనా సాంకేతిక లోపాల వల్ల పథకాలు అందకపోతే అలాంటి వారికే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, కొన్నిచోట్ల ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో తెలుగుదేశం వారు వాటినిఅడ్డుకోవడానికి కోర్టుకు వెళ్తున్నారని, కానీ త్వరలోనే ఇంటి పట్టాలు కూడా ఇస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News