హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: అతడికి 23, ఆమెకు 50.. ఇద్దరి మధ్య ప్రేమ.. చివరికి ఊహించని ట్విస్ట్

Anantapuram: అతడికి 23, ఆమెకు 50.. ఇద్దరి మధ్య ప్రేమ.. చివరికి ఊహించని ట్విస్ట్

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

చిత్తూరు జిల్లా (Chittoor District) కాసిరాళ్ల గ్రామంలో నివాసం ఉంటున్న వేణుగోపాల్ మూర్తికి 23 ఏళ్ల సురేష్ అనే కుమారుడు ఉన్నాడు. పలమనేరులోని ఓ కోళ్లపారంలో సురేష్ పనిచేస్తూ వచ్చాడు. అనంతపురం జిల్లా (Anantapuram District) గోరంట్ల మండలం చింతలపెళ్లికి చెందిన రామ కుమారి (50)కి కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  ఈ రోజుల్లో కొన్ని బంధలా ఎవరి మధ్య ఎలా మొదలవుతాయో చెప్పడం కష్టం. అలాంటి సంబంధాలకు వయసు, ఇతరత్రా విలువలు ఏమీ అవసరం లేదనిపిస్తుంది. అలా వయసుతో బేధం లేకుండా కలిసిన ఓ జంట జీవితం అనూహ్య మలుపులు తిరిగింది. తల్లి వయసున్న మహిళతో ఎఫైర్ పెట్టుకున్న యువకుడు అర్ధాంతరంగా ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) కాసిరాళ్ల గ్రామంలో నివాసం ఉంటున్న వేణుగోపాల్ మూర్తికి 23 ఏళ్ల సురేష్ అనే కుమారుడు ఉన్నాడు. పలమనేరులోని ఓ కోళ్లపారంలో సురేష్ పనిచేస్తూ వచ్చాడు. అనంతపురం జిల్లా (Anantapuram District) గోరంట్ల మండలం చింతలపెళ్లికి చెందిన రామ కుమారి (50)కి కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు.

  రామకుమారి బ్రతుకుదెరువు కోసం పలమనేరులో సురేష్ పనిచేస్తున్న కోళ్లపారంలోనే ఆమె కూలీగా పనిచేయడం ప్రారంభించింది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా మరింత దగ్గరై వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతేకాదు ఆ బంధం కాస్తా సహజీవనానికి దారితేసింది. ఈ క్రమంలో రామకుమారి.. తన చెల్లెలు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని సురేష్ కు చెప్పింది. అందుకు తనతో వచ్చేయాలనే కండిషన్ పెట్టింది. దీంతో కోళ్ల ఫామ్ లో పని మానేసిన సురేష్.. ఆమెతో కలిసి చింతలపల్లికి వెళ్లిపోయాడు.

  ఇది చదవండి: కొడుకు చనిపోయిన 50 రోజులకు కోడలి ఫోన్ చూసిన మామ.. వాట్సాప్ లో విస్తుపోయే మెసేజ్‌లు..


  ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తన్నారు. ఇదిలా ఉంటే సురేష్ క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. ఐతే చింతలపల్లి వచ్చిన సురేష్ తల్లిదండ్రులు తమతో వచ్చేయాలని కొడుకును వేడుకున్నారు. కానీ అతడు మాత్రం తాను రానని.. బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ కత్తితో చేతిని కోసుకునేందుకు యత్నించాడు. దీంతో చేసేదిలేక వారు వెళ్లిపోయారు. ఇటీవల సురేష్ కు పచ్చకామెర్ల వ్యాధి సోకింది.


  ఇది చదవండి: మాయమాటలతో హనీట్రాప్.. మగాళ్లకు చుక్కలు చూపిస్తున్న కర్నూలు యువతి..


  ఐతే శనివారం రాత్రి ఇంటికొచి నిద్రించిన సురేష్.. ఆదివారం ఎంతకూ లేవలేదు. దీంతో అతడు మృతి చెందినట్లు గుర్తించిన రామకుమారి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. హుటాహుటిన చింతలపల్లి వచ్చిన సురేష్ పేరెంట్స్ కొడుకు మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. అనారోగ్యంతో ఉన్న తమ కుమారుడికి సరైన చికిత్స చేయించకుండా మృతికి కారణమైందంటూ రామకుమారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పెనుగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఎదిగిన కొడుకు ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Extramarital affairs

  ఉత్తమ కథలు