Home /News /andhra-pradesh /

ANANTAPURAM YOUNG WOMAN SUSPECT DEATH RAISING MANY QUESTIONS IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN BK

Mystery: తేజస్విని విషయంలో వీడని మిస్టరీ.. ప్రియుడే చేశాడా..? ఆ రాత్రి ఏం జరిగింది..?

నిందితుడు సాధిక్ (ఫైల్)

నిందితుడు సాధిక్ (ఫైల్)

Death Mystery: తేజశ్విని కుటుంబం గతంలో గోరంట్ల పట్టణంలోని ఒకే వీధిలో నివాసం ఉండేది. ఆ సమయంలో అదే వీధికి చెందిన సాధిక్ అనే యువకుడితో తేజస్వినికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.

    M Bala Krishna, News18, Hyderabad

    రోజు రోజుకి ప్రేమ హ‌త్య‌లు ఎక్కువైపోతున్నాయి. నిత్యంలో రాష్ట్రంలో ఎదో మూలా ఇలాంటి ప్రేమ హ‌త్య‌లు జ‌రుగుతున్నాయి. న‌మ్మంచి గొంతు కోయ్య‌డం, ప్రేమించ‌క‌పోతే యాసిడ్ పోయ‌డం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న‌టికి మొన్న క‌లుద్దాం రమ్మంటూ పిలిచి కాబోయే భర్త గొంతు కోసిందో యువతి. తాజాగా అలాంటి దారుణమే చోటు చేసుకుంది. క‌లిసి మాట్లాడుకుందామ‌ని పిలిచిన త‌న చున్నితో గొంతు నులిపి చంపాడో సైకో ప్రేమికుడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన గోపి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. గోపీ పుట్టపర్తి పీహెచ్.సీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె తేజశ్విని తిరుపతి కృష్ణతేజ ఫార్మసి కళాశాలలో బీఫార్మ్ మూడో సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటోంది.

    తేజశ్విని కుటుంబం గతంలో గోరంట్ల పట్టణంలోని ఒకే వీధిలో నివాసం ఉండేది. ఆ సమయంలో అదే వీధికి చెందిన సాధిక్ అనే యువకుడితో తేజస్వినికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలం తర్వాత తేజశ్విని కుటుంబం అక్కడి నుంచి మరోవీధికి మారిపోయింది. అయినా ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉండగానే తిరుపతిలోని కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఆమె మల్లాపల్లిలోని ఓ ఇటుక ఫ్యాక్టరీకి చెందిన షెడ్డులో శవమై కనిపించింది.

    ఇది చదవండి: పెళ్లై 24ఏళ్లైనా ఈ మహాతల్లి పక్కచూపులు మానలేదు.. ఎంతదారుణానికి ఒడిగట్టిందో చూడండి..


    అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతున్నతేజస్వినిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. షెడ్డు పైకప్పుకు చున్నితో ఉరివేసుకోగా ఆమె రెండు కాళ్లు మంచంపై ఉన్నాయి. షెడ్డున్న స్థలం తేజస్విని ప్రియుడు సాధిక్ కు చెందినది కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

    ఇది చదవండి: ఒకరు తర్వాత ఒకరితో ఎఫైర్.. ఇద్దరూ కలిసి ఆమెను ఏం చేశారంటే..!


    సంఘటనా స్థలంలో మృతురాలి బ్యాగు, సెల్ పోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తేజస్వినికి మాయమాటలు చెప్పి తిరుపతి నుంచి కారులో తీసుకొచ్చి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సాదిక్ మల్లాపల్లి ఎస్సీ మహిళను నమ్మించి ప్రేమ పేరుతో వంచించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని వారు ఆరోపించారు. నిందితుడు సాదిక్ పరారీలో ఉండగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఘటనలో అత్యాచారం జరగలేదని.. యువతి మృతి మాత్రం అనుమానాస్పదంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. రాత్రి 10గంటల వరకు ఇద్దరూ రూమ్ లో ఉన్నారని.. ఆ తర్వాత భోజనం తెచ్చేందుకు సాధిక్ బయటకు వెళ్లి వచ్చే సరికి మృతి చెందిఉన్నట్లు చెప్తున్నారు. పరారీలో ఉన్న సాదిక్ ను అదుపులోకి తీసుకుంటే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు