హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రూపాయికి పదిరూపాయాల కావాలా..? ఇంకెన్ని ప్రాణాలు తీస్తారు..?

రూపాయికి పదిరూపాయాల కావాలా..? ఇంకెన్ని ప్రాణాలు తీస్తారు..?

లోన్ యాప్స్ వేధింపులకు అనంతపురం యువకుడు బలి

లోన్ యాప్స్ వేధింపులకు అనంతపురం యువకుడు బలి

చెట్టు ఎదిగితే పదిమందికి నీడను ఇస్తుంది.. అలాగే బిడ్డ ఎదిగి ఓ స్థాయికి వస్తే తల్లిదండ్రులకు ఆధారంగా ఉంటారు. అదే బిడ్డ కొంతమంది వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయం.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

చెట్టు ఎదిగితే పదిమందికి నీడను ఇస్తుంది.. అలాగే బిడ్డ ఎదిగి ఓ స్థాయికి వస్తే తల్లిదండ్రులకు ఆధారంగా ఉంటారు. అదే బిడ్డ కొంతమంది వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయం. ఈ మధ్య కాలంలో లోన్ యాప్ ద్వారా డబ్బులు రుణంగా తీసుకుంటున్నారు. అయితే రుణం తీసుకున్న తర్వాత డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో సరిగా చెల్లించకపోవడం మరియు చెల్లించడానికి ఎక్కువ సమయం తీసుకునేటప్పుడు లోన్ యాప్ నిర్వాహకులు రుణం తీసుకున్న వారిని వేధించడం మొదలుపెట్టారు. అలా వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అంతేకాక లోన్ కట్టని వారిని అసభ్య పదజాలాలతో దూషించి, వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని, వారి బంధువులను కుటుంబాన్ని బెదిరిస్తున్నారు.

అంతేకాక లోన్ యాప్ రుణం తీసుకున్న తర్వాత ఒక నెల సరిగా కట్టకపోయినా ప్రతిరోజు కాల్ చేసి వారికి దూషిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా కాల్ చేస్తూ రుణ సహాయం తీసుకున్న వారిని ఇబ్బంది పెడుతున్నారు. అర్థరాత్రి సమయంలో కూడా వారికి కాల్ చేస్తూ వారి ధైర్యాన్ని కోల్పోయేలా చేసి ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు.ఇలా ఆత్మహత్య చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఎన్నోసార్లు పోలీసు వారు హెచ్చరించి జాగ్రత్త ఉండమని , ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నా, చాలామంది వారి కుటుంబ అవసరాలకి వారి వ్యక్తిగత అవసరాలకి లోన్ యాప్స్ పై ఆధారపడి లోన్ తీసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇది చదవండి: రాజధాని కోసం కర్నూలు .. స్థానికుల డిమాండ్లు ఇవే

ముఖ్యంగా చదువుకుంటున్న యువత వారి పేరెంట్స్తో డబ్బులు అడగలేక ఇలా లోన్ ఆప్స్ పై ఆధారపడి లోన్ తీసుకోవడం, మరియు వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో వారిపై తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నారు. అయితే యువత ప్రలోభాలని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో ట్విస్ట్.. కులసంఘాల ఎంట్రీతో హైడ్రామా..!

గుంతకల్లు పట్టణంలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ అయ్యన్న కుమారుడు అఖిల్ బెంగళూరులో బీటెక్ చదువుతున్నాడు, మూడు రోజుల కిందట ఇంటికి వచ్చాడు తిరిగి కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి బుధవారం సాయంత్రం బయలుదేరాడు ,రాత్రి గుత్తి శివారులోని రైల్వే వంతెన వద్ద రైల్వే కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

తన కుమారుడు లోన్ యాప్ లో రూ.15000 రుణం తీసుకున్నాడని.. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య పాల్పడ్డాడని తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు ఇలాంటి సంఘటనలుపై అవగాహన కల్పిస్తున్నా యువత లోన్స్ పై ఆధారపడుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని వారి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Loan apps, Local News

ఉత్తమ కథలు