హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anantapuram: వరుసకు చెల్లి.. ప్రేమ పేరుతో వేధింపులు.. చివరికి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..!

Anantapuram: వరుసకు చెల్లి.. ప్రేమ పేరుతో వేధింపులు.. చివరికి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Anantapuram: భాస్కర్ అవేమి పట్టించుకోకుండా ఆమె వెంట పడుతూనే వచ్చాడు. తన వన్ సైడ్ లవ్... టూ సైడ్ కాకపోవడంతో భాస్కర్ మైథలిని వేధించడం మొదలుపెట్టాడు. దీన్ని భారీస్తూ వచ్చిన మైథలీ ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఆమె తన తల్లికో.. లేదా పోలీసులకో పిర్యాదు చేసుంటే కథ మరో మలుపు తిరిగేదేమో.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

చట్టాలు ఎన్ని ఉన్నా.. ఎంతటి కఠినమైన శిక్షలు విధించిన మృగాలలో మార్పు మాత్రం రావడం లేదు. ఓ వైపు అత్యాచారాలు మరో వైపు ప్రేమోన్మాదుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ నిరాకరించి., వేరొకరితో వివాహం చేసుకున్న మహిళలపై దాడులు చేస్తూ కటకటాల పాలవుతున్న ప్రేమోన్మాదులు ఎందరో. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) బుక్కరాయసముద్రం మండలం అమ్మవారు పేటలో మైథిలి అనే యువతి తమ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన గుజ్జల భాస్కర్ అనే వ్యక్తి మైథిలిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. నువ్వుంటేనే ఇష్టం... నువ్వు కాదంటేనే కష్టం అంటూ గుజ్జల భాస్కర్.. మైథిలి వెంట పడ్డాడు. కానీ మైధిలి తనకు ప్రేమ, గీమ వద్దని... కుటుంబ బాధ్యతలు ఉన్నాయని భాస్కర్ ప్రేమను తోసిపుచ్చింది.

కానీ భాస్కర్ అవేమి పట్టించుకోకుండా ఆమె వెంట పడుతూనే వచ్చాడు. తన వన్ సైడ్ లవ్... టూ సైడ్ కాకపోవడంతో భాస్కర్ మైథలిని వేధించడం మొదలుపెట్టాడు. దీన్ని భారీస్తూ వచ్చిన మైథలీ ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఆమె తన తల్లికో.. లేదా పోలీసులకో పిర్యాదు చేసుంటే కథ మరో మలుపు తిరిగేదేమో. మైధిలి తండ్రి చనిపోవడంతో ఆయన ఉద్యోగం తల్లికి వచ్చింది. ఆమె స్థానంలో మైథిలి ఉద్యోగం చేస్తోంది. ఇటీవల కల్యాణదుర్గంకు బదిలీ కావడంతో అక్కడికి మకాం మార్చింది.

ఇది చదవండి: ఓఎల్ఎక్స్ లో సేల్ కి పెడితే డబ్బులు రావాలిగానీ.. పోయాయేంటి..? అసలెందుకిలా..?


అయినా మైథిలిని వదిలపెట్టని భాస్కర్.. కల్యాణ దుర్గం వెళ్లి మైథిలికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి రావాలని పిలిచాడు. దీంతో మాట్లాడటం కోసే కదా అని వెళ్లింది. అక్కడ కూడా ప్రేమ, పెళ్లి ప్రస్తావనేతెచ్చాడు. ఈ మాటలు విన్న మైథిలి సున్నితంగానే తిరస్కరించింది. నువ్వు వరుసకు అన్నవు. ప్రేమ పెళ్లి కుదరదని చెప్పేసింది. అనంతరం అక్కడి నుంచి స్కూటీలో వెళ్తుండగా.. కారుతో వేగంగా వెళ్లి ఆమెను ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడినా ఆమెను వదల్లకుండా హతమార్చే ప్రయత్నం చేశాడు. మైథిలి అరుపులతో స్థానికులు రావడంతో కారుతో సహా భాస్కర్ పరారయ్యాడు.

ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.. ఆ తర్వాత ఊహించని స్కెచ్ వేసింది..


తొలుత అందరూ రోడ్డు ప్రమాదమని భావించారు. కాసేపటి తర్వాత తేరుకున్న మైథిలి.. ప్రేమ పేరుతో వేధిస్తూ తనన చంపడానికి యత్నించినట్లు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులక ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రేమోన్మాది భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ దాడిలో గాయపడిన మైథిలి ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఆమె అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Harassment on women

ఉత్తమ కథలు