Home /News /andhra-pradesh /

ANANTAPURAM YCP MLA KETHIREDDY VENKATARAMIREDDY WARN TO TDP AND BJP LEADERS IN ASSEMBLY PLENARY NGS GNT

YCP MLA: కొట్టుకోడానికి.. చంపుకోడానికి ప్రభుత్వం మారడమెందుకు? తేల్చుకుందాం రండీ అంటూ వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్

టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్

YCP MLA: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ప్రస్తుతం ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. దీంతో విమర్శలు హద్దులు దాటుతున్నాయి. కొట్టుకునేందుకు కూడా సిద్ధం రండి అంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే.. టీడీపీ నేతలతో మీ ప్రతాపమో.. మా ప్రతాపమో తేల్చుకుందాం రండీ అంటూ సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...
  YCP MLA: ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) లో ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు అన్నది క్లారిటీ లేకపోయినా.. విపక్షాలు మాత్రం ముందస్తుకు సిద్ధం అంటూ సవాళ్లు విసురుతున్నాయి. ఇఫ్పటికే అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీ అయ్యాయి. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటూ.. అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఇదే సమయంలో మాటల తూటాలు సైతం హద్దులు దాటుతున్నాయి. బూతు పురాణం కూడా అందుకుంటున్నారు కొందరు నేతలు.. వారి ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది. తాజాగా  (Anantapuram Distirct) ధర్మవరం (Darmavaram)లో జరిగిన వైస్సార్సీపీ ప్లీనరి (YSRCP Plenary) లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) ఓ రేంజ్ లో టీడీపీ (TDP) నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాను గుడ్ మార్నింగ్ ధర్మవరం (Good Morning Daramavaram) అంటూ ప్రజల్లోకి పోతే కబ్జా చేయడానికి అంటారా అంటూ మండిపడ్డారు. అక్కడితోనే ఆగలేదు అలాంటి వారిని చెప్పుతో కొట్టాలి అని ఫైర్ అయ్యారు. తన మీద కబ్జా చేస్తున్నవారు ఎవరైనా ఒకరికి పుట్టిన ఎవరైనా సరే నేను అర అడుగు కబ్జా చేశానని నిరూపించండి అంటూ విరుచు కుపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా

  గోనుగుంట సూర్యనారాయణ పై చేశారని తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు టికెట్ తీసుకొని ధర్మవరంలో నిలబడతావా అని ఎదురుచూస్తున్నావ్.. దమ్ముంటే టికెట్ తెచ్చుకుని పోటీ చేసి గెలిచి చూపించి అంటూ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి జనసేన బిజెపి ఎవరైనా సరే గుంపుగా వచ్చిన సింగల్ గా వచ్చిన కూడా పీకేదేమి లేదంటూ ఛాలెంజ్ చేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

  ఇటు ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరాంపైనా పోరక్షంగా విరుచుకుపడ్డారు. మరొక నాయకుడు వచ్చి తమ ప్రభుత్వం వస్తే అంతు చూస్తాం అంటున్నాడు, చంపడానికి కొట్టుకోవాడానికి కేసులు పెట్టుకోవడానికి ప్రభుత్వాలు మారేవరకు ఎందుకు ఎదురు చూడడం,ఇప్పుడే రా కొట్టుకుందాం తేల్చుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేశారు కేతిరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ అసెంబ్లీ ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముందుగా ధర్మవరం మండలంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో వెళ్లి ధర్మవరం పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలోనే ప్రతిపక్ష నాయకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

  ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఎన్ని..? సీఎంగా అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది..? అంబటి రాంబాబు ఏమన్నారంటే.?

  14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏమేరకు అభివృద్ధి చేశారన్నారు. జగన్ మూడేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చూసి ఓర్వలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉంచుతున్న కాబట్టే ప్రజలు తనకు ఓటేసి శీర్వదించారని గుర్తు చేశారు. బీజేపీ. జనసేన, వామపక్షాలు అన్నీ కలసికట్టుగా వచ్చినా ధర్మవరం నియోజకవర్గంలో ఈసారి కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఆది సినిమాలో అస్సాం పార్శిల్ ఎలా చేసాడో తాను ధర్మవరం ఎమ్మెల్యేగా గెలవగానే రెండు నెలలకి ఓడిన వ్యక్తి అస్సాం పార్సల్ అయ్యాడన్నారు. అలాంటి వాళ్లు తన గురించి తప్పుడు మాటలు మాట్లాడడం సరి కాదన్నారు.

  ఇదీ చదవండి : ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా..? ఇంత ఈజీ అని చెబుతున్న మల్లెల సాహితి..

  ఇక ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా న్యాయం చేస్తుంటే అది చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీలో ఉన్న తాగుబోతు నాయకుడు అయ్యన్నపాత్రుడు.. దున్నపోతులా ఉండే అచ్చెనాయుడు విమర్శలు చేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, అనేక సంక్షేమ పథకాలు.. ప్రతి పేదవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్తారన్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు