శ్రీ సత్య సయి జిల్లా పెనుగొండ మండలంమునిమడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీ దివంగత ఎస్.గంగాధర్ సతీమణి బీసీ వర్గానికి చెందిన మంగమ్మను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీఅభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే. ఈమె జన్మస్థలం కల్యాణదుర్గం మండలం సిబాయి. 1979లో మునిమడుగు చెందిన గంగాధర్ తో వివాహం జరిగింది. ఈమె ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఈమెకు నలుగురు కుమారులు.. భర్త గంగాధర్ 1989- 90, 1991 -96 మరియు 1998-2000లో హిందూపురం కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. 2005లో అనారోగ్యంతో మృతి చెందారు.
2014వ ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఎమ్మెల్యే టికెట్ రాలేదు. ఆమె కుమారుడు పెనుగొండ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు నుంచి వారు అనంతపురం నగరంలో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె తోటి కోడలు చంద్రకళ మునిమడుగు ఎంపీటీసీగా గెలుపొంది ప్రస్తుతం పెనుగొండ మండలం వైస్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఈమె కుటుంబం ప్రస్తుతం అనంతపురం నగరంలో ఉంటుంది.
మంగమ్మకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం ఎవరు ఊహించి ఉండరు. పెనుగొండ నియోజకవర్గంలో ఈమె సామాజిక వర్గం బలంగానే ఉంటుంది, అయితే సామాజిక వర్గ రీత్యా ఈమెకు ఎమ్మెల్సీ పదవి లభించింది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంకర్ నారాయణ ఉన్నారు. అయితే అతను బీసీ(కురుమ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కురుబ సామాజిక వర్గం కన్నా మంగమ్మ సామాజిక వర్గమైన బీసీ(బోయ) సామాజిక వర్గం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకొనే మంగమ్మ కు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మంగమ్మకు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే 2024 వ సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పెనుగొండ వైసీపీ గెలవచ్చని అంచనాలతో ఈమెకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News, Ysrcp