Home /News /andhra-pradesh /

ANANTAPURAM WOMAN KILLED HER LOVER AFTER HAVING EXTRAMARITAL AFFAIR IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Affair: పెళ్లైన మహిళతో యువకుడి ఎఫైర్.. సీక్రెట్ వీడియోలపై గొడవ.. కొద్దిసేపటికే షాకింగ్ సీన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Extramarital affair: భర్తతో దొరకని ఆనందాన్ని పరాయి యువకుడితో కోరుకుందో మహిళ.. ఇంజనీర్ గా పనిచేస్తూ సెటిల్ అవ్వాల్సిన వాడు ఆమె మోజులో పడ్డాడు. సహజీవనం పేరుతో సపరేటు కాపురం పెట్టారు.

  GT Hemanth Kumar, News18, Tirupati

  మూడుముళ్ల బంధమైనా పెళ్లితో ఒక్కటవడానికి అంటే.., అక్రమ సంబంధాలంటే మోజు చూపుతున్నారు నేటి యువత. నిండు నూరేళ్లు సాగాల్సిన దాంపత్య జీవితం.. క్షణిక సుఖాలిచ్చే వివాహేతర సంబంధాలతో విచ్ఛిన్నమవుతోంది. పరాయివాళ్లపై వ్యామోహం పెంచుకొని పండంటి నూరేళ్ళ జీవితాన్ని ముళ్లదారిగా మార్చుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థల సాకుతో వేరొకరితో శారీరక సుఖాలవైపు మళ్లుతున్నారు. భర్తతో దొరకని ఆనందాన్ని పరాయి యువకుడితో కోరుకుందో మహిళ.. ఇంజనీర్ గా పనిచేస్తూ సెటిల్ అవ్వాల్సిన వాడు ఆమె మోజులో పడ్డాడు. సహజీవనం పేరుతో సపరేటు కాపురం పెట్టారు. ఐతే ఇద్దరి మధ్య సీక్రెట్ వీడియోలు చిచ్చుపెట్టాయి. . ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది.

  వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా( Anantapuram District) కేంద్రమైన ఆజాద్‌ నగర్‌ కు చెందిన యువకుడు వీరేష్‌ కుమార్‌ (32) వృత్తి రీత్యా ఇంజనీర్. ప్రస్తుతం కూడేరు మండలం కమ్మూరు సమీపంలో ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో సైట్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇతడికి అనంతపురంకు చెందిన ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివహేతర సంబంధంగా మారింది. తరచూ ఆమె దగ్గరికి వెళ్లి ఏకాంతంగా గడుపుతుండేవాడు. ఇద్దరూ విడిగా ఉండలేక గత నెలలో స్కంద కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు.

  ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్తకు దొరికిపోయింది.. గంట తర్వాత షాకింగ్ ఘటన..  ఈ క్రమంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను వీరేష్ సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. దీంతో ఆ వీడియోలను తొలగించాలని వివాహిత వీరేష్ ను కోరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో ప్రియురాలిని బెదిరించేందుకు ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకున్నట్లు నటించాడు. అతడు చనిపోయాడనుకొని వివాహిత చీరను లాగింది. వెంటనే ఆమెను బదిరించేందుకు మీదకు వచ్చాడు. భయపడిన ఆమె కూరగాయలు కోసే కత్తిని అడ్డుపెట్టింది. దీంతో కత్తి వీరేష్ నుదిటి భాగంలో గుచ్చుకుంది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

  ఇది చదవండి: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..!


  అదే సమయంలో ఏం చేయాలో తెలియక ప్రియుడి మెడకు చీరబిగించి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఉదయం వీరేష్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ క్లూజ్ టీమ్ ద్వారా హంతకురాలి కోసం గాలిస్తున్నారు. వీరేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి: ప్రతిరాత్రి ఆ మాట చెప్పాల్సిందే..! సిలబస్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 


  ఇటీవల వివాహేతర సంబంధాలు హత్య దారితీస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. వారం క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి శవాన్ని కనిపించకుండా చేసింది. మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో భార్యను విచారించగా అసలు నిజం బయటపెట్టింది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Extramarital affairs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు