Home /News /andhra-pradesh /

ANANTAPURAM WIFE TRY TO KILL HUSBAND WITH THE HELP OF LOVER IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Wife Affair: ప్రియుడితో కలిసి భర్త పీక కోయాలని ట్రై చేసింది.. ఒక్క సెకను ముందు సీన్ రివర్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Anantapuram: బంగారంలాంటి భర్త ఉండగానే ప్రియుడి మోజులో పడిందో భార్య. అక్కడితో ఆగిందా తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించి కట్టుకున్నవాడి పీక కోసేందుకు యత్నించింది. గానీ ఒక్కసెకను ముందు కథ అడ్డం తిరిగింది.

  GT Hemanth Kumar, News18, Tirupati

  భార్యాభర్తల బంధం పవిత్రమైనది. కష్టసుఖాలు, బరువు బాధ్యతలు, ఆనందం, దుఃఖం ఏదైనా పంచుకొనేది భార్య భర్తల అనుబంధమే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తారు పెద్దలు. కమనీయమైన వివాహ వేడుకలో అగ్నిసాక్షిగా నాతి చరామి అంటూ ప్రమాణం చేసి వధువును అర్ధాంగిగా స్వీకరిస్తారు వరుడు. ఎన్నో ఆశల మధ్య. ఉహల పాన్పు పై వివరిస్తూ నూతన జీవితంలోకి అడుగుపెడతారు దంపతులు. కానీ కొన్ని బంధాలు మాత్రం వివాహవ్యవస్థకే మాయని మచ్చలా మారుతున్నాయి. ఒకరితో కాపురం చేస్తూ వేరొకరితో అక్రమ సంభంధం పెట్టుకుంటున్నారు. పచ్చని కాపురాన్ని నిప్పుల కొలిమిలా మార్చేసుకుంటున్నారు. బంగారంలాంటి భర్త ఉండగానే ప్రియుడి మోజులో పడిందో భార్య. అక్కడితో ఆగిందా తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించి కట్టుకున్నవాడి పీక కోసేందుకు యత్నించింది. గానీ ఒక్కసెకను ముందు కథ అడ్డం తిరిగింది.

  పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన శివయ్య అలియాస్‌ శివారెడ్డి, మమతలకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే మమతకు అదే గ్రామానికి చెందిన కర్రెన్నతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లపాటు సరదా మాటలకు పరిమితమైన వారి బంధం.. ఫోన్ నెంబర్లు మార్చుకునేవరకు వెళ్లింది. ఆ తర్వాత చనువు కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా సంబంధం కొనసాగిస్తూ వచ్చారు.

  ఇది చదవండి: మరో ట్విస్ట్ ఇచ్చిన సాయి ప్రియాంక.. ప్రియుడితో పెళ్లి.. తండ్రికి మెసేజ్..


  ఏనాటికైనా భర్తకు ఈ విషయం తెలిస్తే ప్రియుడు దూరం అవుతాడని భావించింది మమత. భర్త ఉంటే ప్రియుడితో తన సుఖానికి అడ్డుగా ఉంటాడని భావించింది. తమ బంధం సవ్యంగా సాగాలంటే భర్తను హత్య చేయడమే మార్గం అనుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు స్కెచ్ వేసింది. అనుకున్న విధంగా వ్యూహాన్ని అమలు చేసేందుకు పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి ప్రియుడిని ఇంటి వద్దకి రమ్మని చెప్పింది.


  ఇది చదవండి: టెన్త్ క్లాస్ లో ప్రేమించాడు.. వాట్సాప్ లో నెంబర్ పట్టాడు.. ఓ అర్ధరాత్రి ఇంటికెళ్లి ఏం చేశాడో చూడండి..


  భర్త రాత్రి నిద్రలోకి జారుకోగానే తన వెంట పదునైన కత్తి పెట్టుకున్న ఇద్దరు.., శివయ్య గొంతు కోసేయాలని నిర్ణయించుకున్నారు. కత్తి ఎత్తిగోతు కోసే సమయంలో శివయ్య నిద్రలేచాడు. వెంటనే తప్పించుకున్నాడు. దీంతో గొంతుపై చిన్న గాటు వేసి ఇద్దరూ పారిపోయారు. చివరి క్షణంలో భార్య, ఆమె ప్రియుడి దాడి నుంచి తప్పించుకున్న శివయ్య.. వెంటనే ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. డాక్టర్లు చికిత్స చేసి ప్రమాదం లేదని చెప్పడంతో ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాద చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మమత, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Extramarital affairs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు