ANANTAPURAM WIFE KILLED HUSBAND WITH HELP OF LOVER AFTER HAVING EXTRAMARITAL AFFAIR IN ANANTAPURAM DISTRICT OF ANDHPRADESH FULL DETAILS HERE PRN TPT
Affair: భర్తను అడ్డుతొలగిస్తే ఉద్యోగంతో పాటు పెన్షన్.. ప్రియుడితో కలిసి భార్య స్కెచ్.. కానీ చివర్లో ఊహించని ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
Anantapuram: తాగుడుకు బానిసైన భర్తతో విసిగిపోయిన ఓ భార్య.. అతడ్ని అడ్డుతొలగించుకొని భర్త ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రియుడుతో సుఖపడొచ్చని స్కెచ్ వేసింది. కానీ లాస్ట్ మినిట్ లో కథ అడ్డం తిరిగింది.
సాఫీగా సాగే జీవితాలను మద్యం, చెడు వ్యసనాలు, అక్రమ సంబంధాలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. వందేళ్ల జీవితాలను యవ్వనంలోనే తుంచేసుకుంటున్నారు కొందరు. భర్తకున్న వ్యసనాలను ఆసరాగా చేసుకొని కొందరు పక్కచూపులు చూస్తుంటే.. భార్య ప్రవర్తన సరిగా లేదంటూ భర్తలు పరాయి మహిళల మోజులో పడుతున్న కేసులు మరికొన్ని. తాగుడుకు బానిసైన భర్తతో విసిగిపోయిన ఓ భార్య.. అతడ్ని అడ్డుతొలగించుకొని భర్త ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రియుడుతో సుఖపడొచ్చని స్కెచ్ వేసింది. కానీ లాస్ట్ మినిట్ లో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) గుత్తి మండలంలోని చెట్నేపల్లికి చెందిన అశోక్ కుమార్ (45) విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
పెద్దవడుగూరులో లైన్ మ్యాన్ గా నిర్వహిస్తున్న ఇతనికి కొన్నేళ్ల క్రిందట కవితతో పెద్దలు వివాహం వైభవంగా జరిపారు. అశోక్ కుమార్ డ్యూటీ దిగిన వెంటనే మద్యం తాగే అలవాటుంది. నిత్యం మద్యం సేవిస్తూ భార్యను పట్టించుకోవడం మానేశాడు. వీరు నివాసం ఉంటున్న కాలనీలో బసినేపల్లికి చెందిన హరికృష్ణ ఊరూరూ తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేసేవాడు. ఇలా కవిత, ఆమె భర్తతో పరిచయం ఏర్పడింది. అశోక్ కు తాగుడుకు కావాల్సిన డబ్బులను అందిస్తూ.. కవితపై కన్నేశాడు హరికృష్ణ. అసలే భర్త పట్టించుకోవడం లేదన్న కవితకు హరికృష్ణ మాటలు తియ్యగా అనిపించాయి. వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటేవారు. అచనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
హరికృష్ణతో ఏర్పడిన బంధాన్ని జీవితాంతం కొనసాగించాలని భావించింది. భర్తను అడ్డుతొలగించుకుంటే అతడి ఉద్యోగంతో పాటు పెన్షన్ డబ్బులతో జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావించింది. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ పక్కాగా వేసుకుంది. ఏప్రిల్ 12న మధ్యాహ్నం గుత్తి ఆర్ఎస్ శివారులోని రైల్వే వంతెన వద్ద బాలన్న నీటికుంట సమీపంలో మద్యం తాగుతున్న అశోక్ కుమార్ను కవిత, ప్రియుడు హరికృష్ణ కలిసి నీటిలో ముంచి చంపేసి ఏమీ తెలిదన్నట్లు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
రాత్రి 9 గంటల సమయంలో తన భర్త ఇంటికి రాలేదని కవిత తన కుటుంబీకులు, బందపువులకు సమాచారం ఇచ్చింది. తాను కూడా భర్త కోసం వెతుకుతున్నట్లు నటించి.. నీటికుంటలో భర్త డెడ్ బాడీ కనిపించిందంటూ బంధువులకు చెప్పింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు గుత్తి ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. తన భర్త నీటికుంటలో పడి మరణించినట్లు కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే కవిత ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా హత్య చేసిన విషయం బయటపడింది. ప్రియుడు హరికృష్ణతో కలిసి తానే భర్తను చంపినట్లు అంగీకరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.