G Venkatesh, News18, Anantapuram
పద్యం అంటే పదాల కూర్పు. ఒక విషయాన్ని అందమైన భాషలో వివరించడమే పద్యం అంటే. ఐతే ఇప్పుడు పద్యాలకు అంత గుర్తింపు లేదు. కానీ ప్రాచీన సాహిత్యంలో పద్యానికే ప్రాముఖ్యత ఉండేది. కానీ ఇప్పుడు పద్యాలంటే సినిమాలు, నాటకాలకే పరిమితమయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి అనంతపురం జిల్లా (Anantapuram District) కు చెందిన వెంకటరమణ మాత్రం పద్యం అంటే ప్రాణమిస్తాడు. అంతేకాదు పద్యానికి ప్రాణం పోస్తాడు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని వట్టి వెంకటరమణ అద్భుతమైన పద్య రచయిత. ఈయన ఇంతకుముందు వివిధ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. పనిచేస్తున్న కాలంలోనే వెంకటరమణ గారు చాలా పద్యాలు రచించి పాడేవారని తెలిపారు. అలా వెంకటరమణకి తెలుగు మీద తెలుగు సంస్కృతి అంటే ఎంతో అభిమానం. రచించిన పద్యాలు పాడేవారు మరియు వాటి అర్థాలు భావాలనువివరించేవారు.
ఏదైనా ఒక వాక్యం చెబితే వాటిమీద అప్పుడే ఒక అద్భుతమైన పద్యం రచించే అంతటి పండితులు వెంకటరమణ. పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే ఏదైనా సందర్భానుసారం మరియు పాఠశాలలో ఫంక్షన్స్ జరుగుతున్న సమయంలో వాటికి అనుగుణంగా పద్యాలు రచించి అద్భుతంగా పాడే వారిని కూడా తెలిపారు. అంతేగాక వట్టి వెంకటరమణ గారిది గోరంట్ల మండలం అయినందువల్ల పెనుగొండ కోట చరిత్రపైన మరియు రాజకీయ చరిత్ర పైన కూడా కొన్ని వందల పద్యాలు రచించాడు.
అంతేకాక పెనుగొండ కోట పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా 365 దేవస్థానాలు ఉన్నాయని వాటిలో ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి తదితర దేవుళ్ళు ఉన్నారని మరియు వారిపైన అద్భుతమైన పద్యాలు కూడా రచించానని తెలిపారు. ఈ వయసులో కూడా ఈయన అద్భుతంగా పద్యాలను పాడుతున్నారు మరియు రచిస్తున్నారు.ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తూ ఉంటారు.
కానీ అతి కొద్ది మంది మాత్రమే తెలుగుపై మమకారంతో పద్యాలు రచించడం, కావ్యాలు రచించడం పుస్తకాలు రచించడం లాంటివి చేస్తూ ఉంటారు. అందులో ఒకరు గోరంట్ల మండలం చెందిన వట్టి వెంకటరమణ. ఈయన శ్రీ లక్ష్మీదేవి మీద మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అనేక పద్యాలు రచించాను అని తెలిపారు.వాటిలో కొన్ని పద్యాలు మన న్యూస్ 18 ఛానల్ తో పంచుకొని పాడారు.
తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా పద్యాలు రచిస్తూ ఉన్నానని తెలిపారు, మరియు ఇప్పుడు కూడా ప్రతిరోజు తెలుగు సంస్కృత పుస్తకాలు చదువుతూ మరియు తనలోని కొత్త ఆలోచనలతో కొత్త భావాలతో కొత్త పద్యాలను రచిస్తూ ఉంటారని తెలిపారు. ఇలాంటి వారిని చూస్తూ ఉంటే తెలుగు ఇంకా బతికే ఉందని అనిపిస్తుంది.ఇలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సహించి తెలుగు,తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఉపయోగపడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News